దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మంగళవారం పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.422 పెరిగి.. రూ.53,019 కు చేరుకుంది.
వెండి కూడా కిలోకు రూ.1,013 పెరిగి రూ.70,743 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, రూపాయి 16 పైసలు బలహీనపడటం వల్ల బంగారం వెల పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పసిడి వెల ఔన్సుకు 1,963 డాలర్లు ఉండగా.. వెండి 27.31 డాలర్లకు చేరుకుంది.
ఇదీ చూడండి: మార్కెట్లకు లాభాలు- 11,500 పాయింట్ల ఎగువకు నిఫ్టీ