దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు నష్టపోయి 49,201 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 262 పాయింట్లు దిగజారి 14,551 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ రెండు కంపెనీలే లాభపడ్డాయి.
ఎం అండ్ ఎం, ఎస్బీఐ,యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.