ETV Bharat / business

బేర్​కు కరోనా తోడు- సెన్సెక్స్ నష్టం 2,919 పాయింట్లు - స్టాక్ మార్కెట్ వార్తలు

చమురు ధరల పతనం, కరోనా, అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై బలంగా పనిచేశాయి. స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేనంతగా భారీగా పతనమయ్యాయి. సెన్సెక్​ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

stock
స్టాక్ మార్కెట్​
author img

By

Published : Mar 12, 2020, 3:45 PM IST

కరోనా వైరస్, చమురు ధరల పతనం ప్రభావంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఎప్పుడూ లేనంతగా కుదేలయ్యాయి. అన్ని దిక్కుల నుంచి సమస్యలు దాడి చేసిన నేపథ్యంలో మార్కెట్లకు కోలుకునే అవకాశమే దక్కలేదు. ఫలితంగా రికార్డు స్థాయి ఇంట్రాడే పతనాలను నమోదు చేశాయి దేశీయ మార్కెట్లు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 2,919 పాయింట్లు పతనమై 32,778 పాయింట్లకు దిగజారింది. 868 పాయింట్లు పడిపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 9,590 పాయింట్లకు చేరింది.

నిఫ్టీ 10 వేల దిగువకు పడిపోవటం 2018 మార్చి 26 తర్వాత ఇదే తొలిసారి. నిఫ్టీ బ్యాంకు సూచీ 10 శాతం పడిపోయి 17 నెలల కనిష్ఠానికి చేరింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ సూచీ 38 నెలల కనిష్ఠానికి పడిపోయింది.

భారీ నష్టాల్లో...

అన్ని రంగాల సూచీలపై బేర్ ఆధిపత్యం సాధించింది. ఓఎన్​జీసీ, ఎస్బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, బజాజ్​ ఆటో, టీసీఎస్​ నష్టాల కోసం పోటీ పడ్డట్టుగా అనిపించాయి.

చమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో రిలయన్స్​, ఓఎన్​జీసీ షేర్లు భారీగా పతనమయ్యాయి. 30 షేర్ ఇండెక్స్​లో ఇవి కీలక షేర్లు కావటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెట్టాయి. దిగ్గజ సంస్థల షేర్లలో చాలా వరకు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

ట్రంప్ ప్రకటన..

ఐరోపాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు ప్రయాణాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

జర్మనీలో 70 శాతం మంది ప్రజలకు కరోనా సోకవచ్చని ఆ దేశ ఛాన్స్​లర్​ ఎంజెలా మెర్కెల్​ ప్రకటించటమూ మదుపరులను భయాందోళనలకు గురిచేసింది.

కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ చేసిన ప్రసంగం అనంతరం మరింత దిగజారాయి.

ఇదీ చూడండి:బేర్​ మార్కెట్లంటే ఏంటి? వీటితో నష్టమా.. లాభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.