ETV Bharat / business

'వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం' - ఆర్థిక వృద్ధి పతనంపై శక్తికాంత దాస్ స్పందన

ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాణిజ్య వర్గాలు కూడా కరోనా సంక్షోభంతో వచ్చిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఫిక్కీ వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విషయాలు వెల్లడించారు దాస్.

necessary measures Will take to promote growth
ఆర్థిక వృద్ధికి ఆర్​బీఐ చర్యలు
author img

By

Published : Sep 16, 2020, 2:06 PM IST

వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు కొరత లేకుండా, ఆర్థిక వృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కొవిడ్​ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు ఉంటాయని పరిశ్రమ, వ్యాపార వర్గాలకు భరోసా ఇచ్చారు.

పరిశ్రమల విభాగం ఫిక్కీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న దాస్ ఈ విషయాలు వెల్లడించారు.

దేశ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలిన తర్వాత.. దాస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వృద్ధి రేటు ఈ స్థాయిలో పతనమైనట్లు వెలువడిన గణాంకాలు.. కరోనా విధ్వంసానికి నిదర్శనమని చెప్పారు దాస్.

వ్యవసాయ రంగ కార్యకలాపాలు, తయారీ రంగ పర్చేజింగ్ మేనేజ్​మంట్ ఇండెక్స్ (పీఎంఐ), నిరుద్యోగంపై ప్రైవేటు సంస్థల అంచనాలు ప్రస్తుత సంవత్సరం రెండో త్రైమాసికంలో కొంత స్థిరీకరణను సూచించినట్లు తెలిపారు ఆర్​బీఐ గవర్నర్. అయితే సంక్షోభం పూర్తిగా తొలగిపోనందున.. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకునే అవకాశముందని పేర్కొన్నారు.

వ్యాపారులు, పెట్టుబడిదారులు కూడా కరోనా వల్ల ఏర్పడిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని దాస్ సూచించారు.

ఇదీ చూడండి:టమాట ధరలకు రెక్కలు- కేజీ రూ.100

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.