నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో 2019 డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగబాకింది. నవంబర్‌లో 0.58 శాతం ఉన్న ఈ సూచీ డిసెంబర్‌లో ఏకంగా 2.59 శాతానికి చేరింది. 2018 డిసెంబర్‌లో నమోదైన 3.46 శాతంతో పోలిస్తే ఇది తక్కువ.
2019 నవంబర్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 11 శాతం ఉండగా డిసెంబర్‌లో అది 13.12 శాతానికి పెరిగింది. ఆహారేతర వస్తువుల ధరల సూచీ నవంబర్‌లో 1.93 శాతం ఉండగా డిసెంబర్‌లో ఏకంగా 7.72 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు 70 శాతం, ఉల్లి ధరలు ఏకంగా 455.83 శాతం పెరిగాయి.