ETV Bharat / business

కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా? ఐటీఆర్​ దాఖలు చేయండి!

వ్యక్తగత ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఐటీ రిటర్ను సమర్పించాలి.. అని చాలా మందికి అపోహ ఉంటుంది. కొన్ని సార్లు కరెంట్​ బిల్లు ఎక్కువ చెల్లించినా.. విదేశీ ప్రయాణాల కోసం చేసిన ఖర్చుల వల్ల కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఐటీఆర్​ దాఖలు నుంచి ఎవరికి మినహాయింపు ఉంటుంది అనే వివరాలు మీకోసం.

author img

By

Published : Aug 1, 2021, 10:36 AM IST

Who should File ITR
ఐటీఆర్ ఎవరు దాఖలు చేయాలి

అన్ని రూపాల్లో వచ్చిన వార్షిక ఆదాయాన్ని, అదే విధంగా పన్ను చెల్లింపు వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేదే ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్). ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారు తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. మినహాయింపు ఉన్న వారు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మౌలిక మినహాయింపు స్థాయి దాటిన వారు తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలి. అయితే మినహాయింపులతో కూడిన ఆదాయాన్ని మాత్రమే దీనికి పరిగణనలోకి తీసుకోవాలి.

వయస్సుమినహాయింపు ఆదాయం
60 ఏళ్ల లోపురూ. 2.5 లక్షలు
60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకురూ. 3 లక్షలు
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువరూ. 5 లక్షలు

అప్పుడు కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే..

ఆదాయంతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

  • విదేశాలకు సొంత ప్రయాణం, ఇతరుల ప్రయాణంపై రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు
  • ఏదైనా బ్యాంకుకు చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి కంటే ఎక్కువ మొత్తం జమ చేసినప్పుడు
  • రూ. లక్ష కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు
  • విదేశాల నుంచి ఆదాయం ఆర్జిస్తున్న వారు, విదేశాల్లో ఆస్తులున్న వారు, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు

రీఫండ్​ పొందొచ్చు..

నిబంధనల ప్రకారం మరికొన్ని సందర్భాల్లోనూ రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్​ సోర్స్) రూపంలో కొన్ని సార్లు పన్ను చెల్లించి ఉండే అవకాశాలు ఉంటాయి. టీడీఎస్ అంటే ఆదాయం లభించే వద్దే పన్ను చెల్లించటం. వార్షిక ఆదాయం ప్రకారం మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు రీఫండ్ లభిస్తుంది. దీనికోసం రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. రిటర్ను దాఖలు చేయటం ద్వారానే పన్ను రీఫండ్ పొందవచ్చు.

నష్టాలు వచ్చినప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే లాభాలు ఉన్నప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే నష్టాలను మరో ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు. దీన్నే క్యారీ ఫార్వర్డ్ అంటారు. రిటర్నులు దాఖలు ద్వారా మాత్రమే ఈ సౌకర్యం పొందవచ్చు.

ప్రయోజనాలు..

ఐటీ రిటర్నులు దాఖలు చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు పొందటం సులభతరం అవుతుంది. ఐటీఆర్ ఉన్నవారికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీలు)రుణాన్ని సులభంగా ప్రాసెస్ చేస్తుంటాయి. రుణ మంజూరు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

ఐటీఆర్ అనేది ఆదాయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాల్లో ఉత్తమమైనదిగా పరిగణించవచ్చు. అందుకే విదేశాలు వీసా ప్రాసెసింగ్ కోసం దీన్ని కోరుతుంటాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి ప్రముఖ దేశాల ఎంబసీలు వీసా ప్రాసెసింగ్ కోసం ఐటీఆర్​ను సమర్పించాలని అడుగుతాయి. ఐటీఆర్ ఉన్న వారికి త్వరగా వీసా వచ్చే అవకాశం ఉంటుంది.

చివరగా..

పన్ను వర్తించే ఆదాయం లేని వారూ ఐటీఆర్​ సమర్పించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఆదాయం విషయంలో పారదర్శకత పెరుగుతుందని.. ఫలితంగా బ్యాంకుల నుంచి అప్పులు తేసుకోవడం వంటివి సులభమవుతుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.