ETV Bharat / business

ఏ వస్తువుకు ఎంత ధర? కంపెనీల ఇష్టమేనా?

author img

By

Published : Jul 27, 2021, 6:02 PM IST

చాక్లెట్ నుంచి రాకెట్ వరకు ప్రతి దానికి ధర ఉంటుంది. రూపాయి కంటే తక్కువ నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు విలువ చేసే వస్తువులు, సేవలు, ఇతర ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి వివిధ వస్తువుల ధరను కంపెనీలు ఏ విధంగా నిర్ణయిస్తాయి? ఇష్టానుసారం వాటి ధరను నిర్ణయించుకోవచ్చా?

who will decides price of product
వస్తు సేవల ధరను ఎవరు నిర్ణయిస్తారు

మార్కెట్లో కొన్ని లక్షల ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నింటి ధర చాలా తక్కువగా ఉండగా.. మరికొన్నింటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ధరను నిర్ణయించటం కూడా చాలా అంశాలపై ఆధారంగా ఉంటుంది.

ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే చాలా దశలు దాటుకొని రావాలి. ముడిసరకు నుంచి మొదలుకొని వాటి ప్రాసెసింగ్, తయారీ, అంతిమ వస్తువు వరకు ఇలా చాలా ప్రక్రియలు ఉంటాయి.

ఒక వస్తువు ధర అనేది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని..

ఉత్పత్తి ఖర్చు

ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసేందుకు అయిన ఖర్చు దాని ధరను నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ముడిసరకులకు అయ్యే ఖర్చు, తయారు చేసే ప్రక్రియలో ఉన్న సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లు, యంత్రాలపై ఖర్చు లాంటివి ఉంటాయి.

ప్రభుత్వ విధానాలు..

వస్తువు ధరలో ప్రభుత్వ విధానాల పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. పన్నులను బట్టి ధర ఉండే అవకాశం ఉంటుంది. పన్ను ఎక్కువగా ఉన్నట్లయితే ధర ఎక్కువగా ఉండొచ్చు.

సహజ అంశాలు..

సహజంగా ఉండే భౌగోళిక అంశాలు కూడా వస్తువు ధరలో కీలకం. ఒక స్థలంలో మాత్రమే దొరికేవి మిగతా ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉండొచ్చు. రవాణా ఛార్జీలు, ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. యాపిల్స్​ను తీసుకుంటే కశ్మీర్​లో తక్కువ ధర ఉంటాయి. అదే దక్షిణ భారత దేశంలో ఎక్కువ ధర ఉంటాయి.

డిమాండ్-సరఫరా

డిమాండ్-సరఫరా అనేది కూడా ఒక వస్తువు ధరను నిర్ణయించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరఫరా ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నట్లయితే.. ఆ వస్తువు ధర తక్కువగా ఉంటుంది. అదే సమయంలో సరఫరా తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వస్తువు ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛా వాణిజ్య యుగంలో ఒక వస్తువు ధరను నిర్ణయించటంలో ప్రధాన పాత్ర డిమాండ్ సరఫరా శక్తులదే.

లాభాలు..

కంపెనీల లాభాల మార్జిన్ కూడా ధరను ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉత్పత్తులపై ఎక్కువ మార్జిన్ లభిస్తుంది. కొన్ని ఉత్పత్తులపై తక్కువ మార్జిన్ లభిస్తుంది. కొన్ని కంపెనీలకు ఇతర కంపెనీలతో పోల్చితే ఉత్పత్తులు ఒకే రకానికి చెందినవి అయినప్పటికీ లాభాలు ఎక్కువగా తీసుకుంటాయి. సంస్థల బ్రాండ్ విలువ ఆధారంగా లాభాలు ఉంటాయి.

కంపెనీలు ఇష్టం వచ్చినంత ధర నిర్ణయించుకోవచ్చా?

ఒక వస్తువుపై ధరను నిర్ణయించుకోవటంలో కంపెనీకి స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ శక్తులకు అతీతంగా ధరను పెట్టే ధైర్యం కంపెనీలు చేయకపోవచ్చు. కంపెనీలు ఒకవేళ ఒక ఉత్పత్తికి మార్కెట్లో ఉన్న పోటీ ఉత్పత్తుల కంటే మరీ ఎక్కువ ధర పెట్టినట్లయితే కొనుగోళ్లు ఉండకపోవచ్చు. మార్కెట్లో కంపెనీల మనుగడ సాధించాలంటే పోటీతత్వంతో ధరలు నిర్ణయించటం చాలా ముఖ్యం.

కంపెనీ నిర్ణయించుకున్న లక్షిత వినియోగదారులకు అనుగుణంగా ధరను నిర్ణయించే వీలు ఉంటుంది. ప్రీమియం, బడ్జెట్, తక్కువ ధర ఇలా వర్గీకరించుకుని కంపెనీలు వ్యాపార సూత్రాలను పాటిస్తుంటాయి. ప్రీమియం సెగ్మెంట్​లో మంచి ధర ఉండవచ్చు. అదే వేరే సెగ్మెంట్​లో కంపెనీలకు ధర నిర్ణయించటంలో వెసులుబాటు ఉండకపోవచ్చు.

మార్కెట్లో అన్ని రకాల వినియోగదారులుంటారు కాబట్టి ఒకే వస్తువును నాణ్యతలో మార్పులు చేస్తూ వివిధ ధరల వద్ద విక్రయిస్తుంటారు. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తుల విషయంలో మార్జిన్ తక్కువగా ఉంటుంది. ఇందులో నిత్యావసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో కూడా ధర నిర్ణయించుకునేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉండకపోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.