ఐటీఆర్-1 ఫారంను సహజ్ అని కూడా అంటారు. పన్ను చెల్లింపుదారులలో చాలా మంది ఈ ఫారంను ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా వేతన జీవులకు, రూ.50 లక్షలలోపు ఆదాయం కలిగిన భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.
ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డివిడెండ్ నుంచి వచ్చిన ఆదాయం రూ.10 లక్షలు దాటితే ఐటీఆర్-1 ఫారం దాఖలు చేసేందుకు వీల్లేదు. రూ.10 లక్షల లోపు డివిడెండ్ ఆదాయంపై షేర్ హోల్డర్ల చేతిలో పన్ను ఉండదు. ఐటీర్-1 ఫారంను వ్యక్తులు (హెచ్‌యూఎఫ్ కాదు) దాఖలు చేయవచ్చు.
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ ఆదాయానికి ఏ ఫారం సరిపోతుందో దానిని మాత్రమే తీసుకొని దాఖలు చేయాలి. మీ ఆదాయ మార్గాలు, ఆస్తులను బట్టి ఐటీర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు ఏది మీకు వర్తిస్తుందో తెలుసుకోవాలి.
ఐటీఆర్-1 ఎవరికి?
వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందే వారు ఐటీఆర్-1 ద్వారా రిటర్నులు చెల్లించాలి. ఇంటి అద్దె, ఇతర మార్గాల ద్వారా (లాటరీలు లేదా ఇతర ఆదాయం) మొత్తం ఆదాయం కలిపి రూ.50 లక్షలకు మించని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో భార్య లేదా భర్త లేదా మైనర్ పిల్లల పేరు మీద ఉన్న ఆదాయం కూడా కలిపి దాఖలు చేయవచ్చు.
ఐటీఆర్-1 ఎవరికి కాదు?
గతంలో ఐటీఆర్-1 ను విదేశాల్లో ఉన్న వారికి లేదా ఎన్ఆర్ఐలకు ఐటీఆర్-1 ను ఉపయోగించేందుకు వీల్లేదు. డివిడెండు లేదా మూలధన ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారు దీనికి ఆర్హులు కారు. దేశంలో ఉన్నవారికి ఇతర దేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశాల నుంచి ఆదాయం పొందుతున్నా వారికి ఐటీఆర్-1 ఫారం ఉపయోగించకూడదు.
సరైన ఐటీఆర్-1 ఫారంను ఎంచుకోకపోతే ఆదాయ శాఖ మీ రిటర్నులు లెక్కలోకి తీసుకోదు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఐటీర్ గురించి తెలియకపోతే ఆర్థిక సలహాదారులు, నిపుణులు, పన్ను అధికారుల నుంచి సలహా తీసుకోండి.
ఇదీ చదవండి: