ETV Bharat / business

'2020-21లో భారత వృద్ధి రేటు 4.8 శాతమే'

author img

By

Published : Apr 9, 2020, 12:46 PM IST

కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు 'ఆసియా పసిఫిక్​ ఆర్థిక సామాజిక సర్వే 2020' పేరిట నివేదిక విడుదల చేసింది.

india gdp
జీడీపీ వృద్ధి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపడం వల్ల 2020-21 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమవుతుందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఆసియా పసిఫిక్​ ఆర్థిక సామాజిక సర్వే 2020: స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు' పేరిట నివేదిక విడుదల చేసింది. అయితే.. 2021-22 సంవత్సరానికి 5.1 శాతం పురోగతి సాధించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న వర్తకం, పర్యటకం, ఆర్థిక సంబంధాల మధ్య కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతోందని ఐరాస పేర్కొంది. ఈ పరిస్థితుల మధ్య భారత వృద్ధి రేటు క్షీణిస్తుందని వెల్లడించింది.

"కొవిడ్-19 మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఇప్పుడే నియంత్రణలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆసియా పసిఫిక్​లో ఉన్న ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ముందస్తు అంచనాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు క్షీణిస్తుంది."

-ఐరాస నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొన్నందున అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ఈ వైరస్ దుష్ప్రభావం చూపుతోందని ఐరాస నివేదిక వెల్లడించింది. కరోనా ప్రభావంతో ఈ ప్రాంతం 0.6-0.8శాతం జీడీపీ కోల్పోతుందని లెక్కగట్టింది. 2019లో ఈ ప్రాంత జీడీపీ 4.3 శాతానికి పరిమితమైందని.. మందగమనానికి చైనా, రష్యా, భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కారణమవుతున్నాయని పేర్కొంది.

ఫార్మా రంగంపైనా

సరఫరా వ్యవస్థకు విఘాతం కలగడం వల్ల ఫార్మా రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఐరాస తెలిపింది. కరోనా విస్తృతి పెరిగితే.. ప్రపంచానికి 20శాతం ఔషధాలు సరఫరా చేసే భారత్.. భారత్​కు 70 శాతం ఫార్మా ముడి పదార్థాలు ఎగుమతి చేసే చైనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పారిపోయిన ప్రేమజంట- లాక్​డౌన్ రూల్స్​కు బుక్కైందంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.