అమెరికా దీర్ఘకాలిక మార్ట్గేజ్ (తనఖా) రేట్లు ఈ వారం మరోసారి రికార్డు స్థాయిలో తగ్గాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారుకోవడం ఇందుకు కారణం. తనఖా రేట్లు పడిపోవడం ఈ ఏడాది వరుసగా ఇది 15వ సారి.
మార్ట్గేజ్ ఫినాన్స్ సంస్థ ఫ్రెడ్డీ మెక్ ప్రకారం 30 ఏళ్ల ఫిక్సెడ్ గృహ రుణాల రేటు 2.71 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 3.73 శాతం వద్ద ఉంది. 15 ఏళ్ల ఫిక్సెడ్ రుణాల రేట్లు కూడా 2.26 శాతం నుంచి 2.21 శాతానికి పడిపోయినట్లు తెలిపింది ఫ్రెడ్డీ మెక్.