దేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంపై కేంద్రాన్ని తప్పుబట్టింది కాంగ్రెస్. దీనిని మోదీనే కారణమని తెలిపింది.
జీడీపీ తిరోగమనానికి జాతీయ, అంతర్జాతీయ అంశాలే కారణమన్న ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రకటన సరికాదని తెలిపింది. జీడీపీ క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ గౌడ. '' కుంగిపోతున్న ఆర్థిక నావ.. పెరిగిపోతున్న కుంభకోణాల''పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-
GDP growth tanks to 5%
— Rajeev Gowda (@rajeevgowda) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Demonetisation, hasty GST, & incompetence continue to show results!
Slump is not due to global issues. It’s a pure 'Modi-made' disaster #ModiHaiToMandiHai
Can economy get any worse & new distractions emerge? Keep your seatbelts on #UnfitGovtUnfitEconomy
">GDP growth tanks to 5%
— Rajeev Gowda (@rajeevgowda) August 30, 2019
Demonetisation, hasty GST, & incompetence continue to show results!
Slump is not due to global issues. It’s a pure 'Modi-made' disaster #ModiHaiToMandiHai
Can economy get any worse & new distractions emerge? Keep your seatbelts on #UnfitGovtUnfitEconomyGDP growth tanks to 5%
— Rajeev Gowda (@rajeevgowda) August 30, 2019
Demonetisation, hasty GST, & incompetence continue to show results!
Slump is not due to global issues. It’s a pure 'Modi-made' disaster #ModiHaiToMandiHai
Can economy get any worse & new distractions emerge? Keep your seatbelts on #UnfitGovtUnfitEconomy
''జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి చేరింది. నోట్ల రద్దు, తొందరపాటు జీఎస్టీ వంటి అసమర్థ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. స్థూల దేశీయోత్పత్తి క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవు. దీనికి పూర్తిగా మోదీనే కారణం.''
- రాజీవ్ గౌడ, కాంగ్రెస్ ప్రతినిధి
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రకటనపైనా కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పోతుందని.. బ్యాంకింగ్ వ్యవస్థ నాశనమవుతుందని పేర్కొంది. ఈ విలీనంతో బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ అన్నింటికీ సమానంగా ఉందా అని ప్రశ్నించిన హస్తం పార్టీ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అడిగింది.
-
Our economy is growing faster than US & China, claimed FM @nsitharaman.
— Congress (@INCIndia) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
At this point the country Is left wondering if this govt has any clue what growth rate even means. #GDPinICU pic.twitter.com/i4A5fRKY48
">Our economy is growing faster than US & China, claimed FM @nsitharaman.
— Congress (@INCIndia) August 30, 2019
At this point the country Is left wondering if this govt has any clue what growth rate even means. #GDPinICU pic.twitter.com/i4A5fRKY48Our economy is growing faster than US & China, claimed FM @nsitharaman.
— Congress (@INCIndia) August 30, 2019
At this point the country Is left wondering if this govt has any clue what growth rate even means. #GDPinICU pic.twitter.com/i4A5fRKY48
నిరర్థక ఆస్తుల వివరాలను వెల్లడించాలని కోరింది. తాజా పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని.. కేంద్రం దీనిని అంగీకరించక తప్పదని పేర్కొంది.