ETV Bharat / business

ప్యాకేజ్​ 2.0: కూలీలు, రైతులు, చిరు వ్యాపారులకు దన్నుగా - second phase of economic package

Union Finance Minister Nirmala Sitharaman will announce the second round of COVID-19 relief package on Thursday.

Finance Minister Nirmala Sitharaman
కరోనా ప్యాకేజ్​ 2.0: నిర్మల ప్రెస్​మీట్​
author img

By

Published : May 14, 2020, 4:00 PM IST

Updated : May 14, 2020, 7:26 PM IST

17:28 May 14

తొలిరోజు ఆర్థిక ప్యాకేజీ వివరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్రం... రెండో రోజు వలస కూలీలు, రైతులు, మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. లాక్​డౌన్​తో​ చితికిపోయిన చిరు, వీధి వ్యాపారులకు దన్నుగా నిలిచింది. వలస కూలీల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది. వలస కార్మికులు, పట్టణ పేదల కోసం హౌసింగ్​ పథకాన్ని తీసుకువచ్చింది. రైతులకు అదనపు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

వలస కూలీల కోసం...

  1. రానున్న రెండు నెలల పాటు అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ.
  2. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందజేత.
  3. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లబ్ధిదారులను గుర్తించి రేషన్ అందజేస్తాయి.

ఒకే రేషన్ కార్డు విధానం..

  • ఆగస్టు నాటికి ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానం అమలు. ఈ విధానంతో లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు.

కొత్త పథకం..

వలస కార్మికులు, పట్టణ పేదల కోసం.. ప్రధాన మంత్రి ఆవాస యోజన కొత్త పథకం అమలు.

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చౌకగా అద్దె ఇళ్లు అభివృద్ధి.

చిరు, వీధి వ్యాపారులకు...

ముద్ర శిశు రుణాలు

  1. ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ.
  2. 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2శాతం ఇంట్రెస్ట్ సబ్​వెన్షన్(వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం.
  3. ఈ సబ్సిడీ ద్వారా రూ.1500 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా.

వీధి వ్యాపారులు

  1. కరోనా కారణంగా వీధి వ్యాపారులే తీవ్రంగా దెబ్బతిన్నారని నిర్మలా స్పష్టం.
  2. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించే విధంగా రూ.5 వేల కోట్ల రుణ సదుపాయం.
  3. వ్యాపారులకు రూ.10 వేల పెట్టుబడి సాయం.

రైతులకు...

  1. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రాష్ట్రాలకు 6,700 కోట్ల పెట్టుబడి సాయం.
  2. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు.
  3. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు.
  4. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి.
  5. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు.

17:24 May 14

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​ రెండో రోజు ప్రకటనలో.. వలస కూలీలపై వరాల జల్లు కురిపించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా, పట్టణ పేదలకు, వలస కార్మికులకు చౌకగా అద్దె ఇళ్లు సమకూర్చేందుకు నూతన పథకం తీసుకొస్తామన్నారు.

ఆకలి తీరుస్తాం...

రానున్న రెండు నెలల పాటు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు నిర్మలా. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లబ్ధిదారులను గుర్తించి రేషన్ అందజేస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చు రూ.3,500 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

ఒకే రేషన్ కార్డు విధానం..

ఇకపై ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానం అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఫలితంగా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆమె తెలిపారు. ఆగస్టు నాటికి 21 రాష్ట్రాల్లో 67 కోట్ల మంది (83 శాతం జనాభా)... 2021 మార్చి నాటికి నూటికి నూరు శాతం అందర్నీ ఈ పరిధిలోకి తీసుకొస్తామని ఆర్థికమంత్రి అన్నారు.

కొత్త పథకం..

వలస కార్మికులు, పట్టణ పేదల కోసం.. ప్రధాన మంత్రి ఆవాస యోజన కొత్త పథకం అమలు చేస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చౌకగా అద్దె ఇళ్లు అభివృద్ధి చేస్తామన్నారు. దీని వల్ల వలస కార్మికులు, పట్టణ పేదలకు నివాస భారం తగ్గుతుందన్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

17:17 May 14

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రెండో రోజూ విశదీకరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా రైతులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులపై ప్రధానంగా దృష్టి సారించారు.

ముద్ర శిశు రుణాలు

ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2శాతం ఇంట్రెస్ట్ సబ్​వెన్షన్(వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.​ దీని ద్వారా 3 కోట్ల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సబ్సిడీ ద్వారా రూ.1500 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.

వీధి వ్యాపారులు

కరోనా కారణంగా వీధి వ్యాపారులే తీవ్రంగా దెబ్బతిన్నారని నిర్మలా పేర్కొన్నారు. పూర్తి లాక్​డౌన్ విధించడం వల్ల ఎలాంటి వ్యాపారం నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించే విధంగా రూ.5 వేల కోట్ల రుణ సదుపాయం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

దీని ద్వారా వివిధ రాష్ట్రాల్లోని 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని నిర్మల పేర్కొన్నారు. వ్యాపారులకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు.

17:06 May 14

ఉపాధి కల్పన

"'క్యాంపా' పథకం అమలు చేస్తాం. అడవుల పెంపకం, అడవుల నిర్వహణ, సంరక్షణ, జంతు సంరక్షణకు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రూ. 6 వేల కోట్ల ప్రతిపాదనలు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చాయి. వాటి ద్వారా గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తాం." - కేంద్ర ఆర్థిక మంత్రి

17:00 May 14

హౌసింగ్​..

"దిగువ మధ్యతరగతికి ( 6-18 లక్షల వార్షిక ఆదాయం వచ్చేవారు) చౌక ఇళ్ల పథకం అమలు. 2017లో తెచ్చిన క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్​ 2021 మార్చి వరకు పొడిగిస్తాం. 2020 మార్చితో ముగియాల్సిన ఆ పథకంతో ఇప్పటికే 3.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మరో 2.5 కుటుంబాలకు తాజా నిర్ణయంతో లబ్ధి." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:56 May 14

వీధి వ్యాపారులు...

"వీధి వ్యాపారులకు సులభంగా రుణాలు అందించేందుకు త్వరలో కొత్త పథకం తెస్తాం. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరే అవకాశం. రూ.10 వేలు ఇనీషియల్​ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాం. మొత్తం రూ.5 వేల కోట్లు ప్రభుత్వం తరఫున అందజేత." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:54 May 14

చిరు వ్యాపారులకు...

"ముద్రా విభాగంలో శిశు రుణాలు తీసుకున్నవారికి 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2 శాతం ఇంట్రెస్ట్ సబ్​వెన్షన్​ సపోర్ట్ ఇస్తాం​. దాదాపు రూ.1500 కోట్ల మేర లబ్ధి. 3 కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నాం." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:51 May 14

వలస కార్మికులకు ఆవాస్​ యోజన...

"వలస కార్మికులు, పట్టణ పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన పేరుతో కొత్త పథకం అమలు చేస్తాం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చౌకగా అద్దె ఇళ్లు అభివృద్ధి చేస్తాం. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాం." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:47 May 14

"ఒకే దేశం- ఒకే రేషన్​ కార్డు విధానం అమలు చేస్తాం. దేశంలో ఎక్కడ ఉన్నా రేషన్​ సరకులు తీసుకునే వీలు కల్పిస్తాం. ఆగస్టు నాటికి 21 రాష్ట్రాల్లో 67 కోట్ల మంది (83శాతం) లబ్ధిదారులు ఈ విధానం పరిధిలోకి వస్తారు. మార్చి 2021 నాటికి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు వర్తించేలా చేస్తాం." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:43 May 14

వలస కార్మికులు..

"రానున్న 2 నెలలపాటు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. రేషన్​ కార్డు లేకపోయినా ఐదు కిలోలు బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందజేస్తాం. లబ్ధిదారుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలే అందజేస్తాయి. మొత్తం 8 కోట్ల మందికి ఇది లబ్ధి చేకూరుస్తుందని అంచనా వేస్తున్నాం. మొత్తం ఖర్చు రూ. 3,500 కోట్లు కేంద్రమే భరిస్తుంది." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:40 May 14

వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  

"గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ట్రాలకు వర్కింగ్‌ కేపిటల్‌ కింద రూ.6,700 కోట్లు కేటాయిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద రూ.10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా చేశాం" - కేంద్ర ఆర్థికమంత్రి 

16:26 May 14

  • గ్రామీణ, సహకార బ్యాంకులకు మార్చిలో రూ.29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌: ఆర్థికమంత్రి
  • పట్టణ పేదలు, వలస కూలీలకు అన్నపానీయాల కోసం ఏర్పాట్లు: ఆర్థికమంత్రి
  • సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం: ఆర్థికమంత్రి
  • వలస కార్మికులకు నగదు పంపిణీ జరిగింది: కేంద్ర ఆర్థికమంత్రి
  • అన్నపానీయాలు అందించేందుకు నిరంతర కృషి జరుగుతోంది: ఆర్థికమంత్రి
  • రోజుకు మూడుపూటలా అన్నపానీయాలకు కృషిచేస్తున్నాం: కేంద్ర ఆర్థికమంత్రి
  • పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు అందించాం: ఆర్థికమంత్రి
  • పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్ అందించాం
  • కొవిడ్‌ సమయంలోనే 7200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి: ఆర్థిక మంత్రి

16:22 May 14

సకలాంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25 వేల కోట్లు రుణాలు ఇస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  - నిర్మలా సీతారామన్​

16:12 May 14

రైతులకు ఇప్పటికే చాలా చేశాం: కేంద్రం

"3 కోట్ల మంది రైతులకు ఇప్పటికే లబ్ధి చేకూర్చాం. రూ.4 లక్షల కోట్ల రుణాలు అందజేశాం.  - కేంద్రం

16:10 May 14

  • సన్నకారు రైతులు, స్వయం ఉపాధి పొందుతున్న వారిపై దృష్టి: కేంద్ర ఆర్థికమంత్రి
  • చిరు వ్యాపారుల కోసం ముద్ర రుణాలు: కేంద్ర ఆర్థికమంత్రి
  • పేదల కోసం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన: కేంద్ర ఆర్థికమంత్రి
  • రెండో రోజు ప్యాకేజీలో తొమ్మిది విభాగాలకు కేటాయింపులు: కేంద్ర ఆర్థికమంత్రి
  • గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి: కేంద్ర ఆర్థిక మంత్రి

16:05 May 14

వలస కార్మికులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్న రైతులకు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించనున్న నిర్మలా సీతారామన్​.

15:53 May 14

కరోనా ప్యాకేజ్​ 2.0: నిర్మల ప్రెస్​మీట్​

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది నిమిషాల్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆమె మరో దఫా ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది.

తొలి రోజు... ఎమ్​ఎస్​ఎమ్​ఈలు, డిస్కంలు, గుత్తేదారులు, డెవలపర్స్‌కు సంబంధించి ఆరు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్... నేడు మరిన్ని రంగాలకు చేయూతనిచ్చే ప్రకటనలు చేస్తారని ప్రజలు వేచిచూస్తున్నారు.

Last Updated : May 14, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.