ETV Bharat / business

సెప్టెంబర్​లో సేవా రంగం దాదాపు రికవరీ! - సేవా రంగంపై కొవిడ్ ప్రభావం

సెప్టెంబర్​లో సేవా రంగ కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఐహెచ్​ఎస్​ మార్కిట్ విడుదల చేసిన నెలవారీ నివేదికలో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 49.8గా నమోదైనట్లు తెలిసింది.

service sector pmi in September
సెప్టెంబర్​లో కాస్త మెరుగైన సేవారంగం
author img

By

Published : Oct 6, 2020, 12:44 PM IST

లాక్​డౌన్​తో భారీగా దెబ్బతిన్న సేవా రంగం సెప్టెంబర్​లో దాదాపు రికవరీ అయ్యింది. గత నెల సేవా రంగ కార్యకలాపాలు పుంజుకున్నట్లు ఐహెచ్​ఎస్ మార్కిట్ నెలవారీ నివేదికలో తేలింది.

ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్​లో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్​ (పీఎంఐ) 49.8గా నమోదైంది. ఆగస్టులో ఇది 41.8గా ఉంది. అయినప్పటికీ గత నెల కూడా పీఎంఐ.. సాధారణ స్థాయి కన్నా కాస్త తక్కువగానే నమోదైనట్లు నివేదిక తెలిపింది. పీఎంఐ 50కిపైగా ఉండే కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నట్లు భావించాలని వివరించింది.

సేవా రంగ వ్యాపార కార్యకలాపాల పీఎంఐ జులైలో 34.2గా, జూన్​లో 33.7గా నమోదవడం గమనార్హం.

ప్రభుత్వం చేపట్టిన అన్​లాక్ ప్రక్రియతో సేవా రంగ వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనే విషయాన్ని సెప్టెంబర్​ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఉపాధి పరంగా క్షీణతే..

సేవా రంగంలో ఉద్యోగాల పరంగా చూస్తే మాత్రం వరుసగా ఏడో నెలలోనూ(సెప్టెంబర్​లో) ఉపాధి అవకాశాలు క్షీణించినట్లు పేర్కొంది ఐహెచ్​ఎస్​ మార్కిట్ నివేదిక.

ఇదీ చూడండి:ఐటీ ఫలితాలు ఆకట్టుకుంటాయ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.