ETV Bharat / business

వడ్డీ మాఫీపై ఆర్థికశాఖ వివరణ కోరిన సుప్రీం - ఈఎంఐలపై వడ్డీ రద్దుపై కేంద్రం స్పందన

రుణాలపై ఆర్​బీఐ విధించిన మారటోరియం కాలంలో వడ్డీ వసులు చేయొద్దని దాఖలైన పిటిషన్​పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరింది.

rbi Moratorium news
ఈఎంఐల వడ్డీ మాఫీపై కేంద్రం స్పందన
author img

By

Published : Jun 4, 2020, 4:03 PM IST

లాక్‌డౌన్‌ వల్ల రుణాలపై మారటోరియం విధించిన నేపథ్యంలో వడ్డీ మాఫీపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. బ్యాంకుల ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకొని వడ్డీమాఫీ చేయటం సరైన నిర్ణయం కాదని ఆర్​బీఐ పేర్కొనటంతో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ షాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి సమాధానం కోరింది. ఇందులో రుణాలపై వడ్డీమాఫీ, వడ్డీపై వడ్డీ రద్దు వంటి రెండు అంశాలు ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుతమున్న కిష్ట పరిస్థితుల్లో ఈఎంఐలపై మారటోరియం విధించి, మరోవైపు రుణాలపై వడ్డీ వేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రుణాల తిరిగి చెల్లింపులో వడ్డీ వసూలు చేయకుండా ప్రభుత్వాన్ని, ఆర్​బీఐని ఆదేశించాలని ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంలో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ఆర్థిక శాఖ వివరణ సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు.

ఇదీ చూడండి:నేడో, రేపో భారత్​కు మాల్యా.. నేరుగా కోర్టుకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.