ఆరోగ్య రంగం హర్షం- నిరాశలో పర్యటకం! - బడ్జెట్‌పై భారత్ బయోటెక్ స్పందన
అసాధారణ సంక్షోభ పరిస్థితుల నడుమ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య భారతానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రకటించిన బడ్జెట్‌పై ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల అభిప్రాయాలు, ఆయా రంగాల నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
భారీ అంచనాలు, ఎన్నో ఆశల నడుమ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై వివిధ రంగాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరోగ్య భారతానికి ప్రాధాన్యం మంచిదే..
పద్దులో కేటాయింపులపై ఆరోగ్య రంగం హార్షం వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటానికి మాత్రమే కాకుండా.. బలమైన ఆరోగ్య భారతాన్ని నిర్మించుకునేందుకు బడ్జెట్ ప్రోత్సహాకాలు సహాయపడుతాయని ఆ రంగ నిపుణులు అంటున్నారు.
కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్ల కేటాయింపును 'సుదూర లక్ష్య సాధన' నిర్ణయంగా అభివర్ణించింది.. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్. ఈ నిధి 'వైరల్ వ్యాధి విముక్త భారత్'కు దోహదం చేస్తుందని సంస్థ ఛైర్మన్ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు.
మూడీస్ సందేహం..
బడ్జెట్ తర్వాత భారత సార్వభౌర రేటింగ్‌పై మౌనం వహించింది మూడీస్ రేటింగ్. పన్నులు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా అధిక ఆదాయం రాబట్టే అంశంపై మాత్రం సందేహం వ్యక్తం చేసింది.
బడ్జెట్ 2021-22లో ద్రవ్య లోటు అంచనాను 9.5 శాతంగా ప్రకటించింది కేంద్రం.
ఎఫ్ఆర్బీఎం కూడా 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ద్రవ్యోలోటు జీడీపీలో 4.5 శాతానికి మించొద్దని సూచిస్తోంది.
పర్యటక, ఆతిథ్య రంగానికి నిరాశ..
కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన పర్యటక, ఆతిథ్య రంగం బడ్జెట్లో తక్షణ ఉపశమన ప్రకటనలు ఉంటాయని ఆశించింది. అయితే అలాంటి ప్రకటనలు ఏవీ లేకపోవడం వల్ల బడ్జెట్ 2021 నిరాశపరిచిందని 'భారత పర్యటక, ఆతిథ్య సంఘాల సమాఖ్య (ఫెయిత్)' ఛైర్మన్ నకుల్ ఆనంద్ పేర్కొన్నారు.
పారిశ్రామిక వర్గాలు..
పారిశ్రామిక వర్గాలూ బడ్జెట్‌పై ప్రశంసలు కరిపించాయి.
సంస్కరణాత్మక బడ్జెట్‌ను తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు శుభాకాంక్షలు తెలిపారు వేదాంత రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్. వ్యూహాత్మ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక వృద్ధికి ఊతమందిస్తుందని అభిప్రాయపడ్డారు.
'అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కావాల్సినంత ఖర్చు చేయడం లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఏదో ఒకటి చేయాలి. ద్రవ్య లోటు విషయంలో మనం ఉదారంగా వ్యవహరించాలి అని ఈ బడ్జెట్ ద్వారా నేను ఆశిస్తున్నా.' అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
'ఇది పూర్తిగా ఆర్థిక వ్యవస్థకు భరోసానిచ్చే బడ్జెట్. ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకుండా అందరి ఆకాంక్షలకు తగ్గట్లుగా ఉంది.' అని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగం..
బడ్జెట్ 2021 ఆరోగ్య రంగానికి మరింత ఊతమిస్తుందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకూ బడ్జెట్ తోడ్పడుతుందని అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్ల మూలధన సాయం స్వాగతించదగ్గ నిర్ణయమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎస్ఎస్ మల్లికార్జున రావు పేర్కొన్నారు.
చిన్న సంస్థలకు పెద్ద ఊరట..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మొత్తం రూ.15,700 కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే రెట్టింపని సీఐఐ గోవా పేర్కొంది. ఈ మొత్తం ఎంఎస్ఎంఈలకు భారీ ఉరటనిస్తుందని అభిప్రాయపడింది.
ఇవీ చూడండి: