పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.2కోట్ల జరిమానా విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ). స్విఫ్ట్ సాఫ్ట్వేర్ దుర్వినియోగానికి పాల్పడి రెగ్యులేటరీ చట్టం ఉల్లంఘించడం వల్ల పీఎన్బీపై ఈ చర్య తీసుకుంది.
స్విఫ్ట్ (ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) ఆర్థిక సంబంధ లావాదేవీల కోసం ఉపయోగించే ఒక మెసేజింగ్ సాఫ్ట్వేర్. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతడి మామ మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారు. స్విఫ్ట్ సాఫ్ట్వేర్ దుర్వినియోగం చేసి రూ.14వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడ్డారు.
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా జరిమానాలు విధించింది ఆర్బీఐ.