కరోనా సంక్షోభం నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు అండగా నిలిచేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. రూ.50 వేల కోట్లతో లిక్విడిటీ సదుపాయం అందిచాలని నిర్ణయించింది. ఈ ప్యాకేజీ నేటి నుంచి మే 11 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ప్రాంక్లిన్ టెంపుల్టన్.. కరోనా కారణంగా ఆరు రుణ పథకాలను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
లాక్డౌన్ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. ప్రస్తుతానికి రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్లలో మాత్రమే లిక్వడిటీ ఒత్తిడి ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి:'పన్నుల పెంపు' ఉచిత సలహాపై కేంద్రం ఆగ్రహం