ETV Bharat / business

'పన్నుల పెంపు' ఉచిత సలహాపై కేంద్రం ఆగ్రహం

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సీనియర్ రెవెన్యూ అధికారుల బృందం చేసిన బహిరంగ సూచనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోర్స్ పేరుతో నివేదికను ట్విట్టర్​లో పోస్ట్​ చేయటాన్ని ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా గుర్తించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

FORCE
'ఫోర్స్' నివేదిక
author img

By

Published : Apr 27, 2020, 10:55 AM IST

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పన్ను విభాగం సీనియర్ అధికారులు చేసిన సూచనలపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సూచనలను ట్విట్టర్​, వెబ్​సైట్లలో పెట్టడాన్ని బాధ్యతారాహిత్య చర్యగా పరిగణించినట్లు సమాచారం.

ఈ చర్యపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్​ వివరణ కోరినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బహిరంగంగా ఇటువంటి అంశాలను రాయటానికి వారికి ఎలాంటి అధికారం ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

'ఫోర్స్' పేరుతో సూచనలు..

కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సీనియర్ ఆదాయపు పన్ను అధికారుల బృందం ఆదివారం కొన్ని సూచనలు చేసింది. కరోనా మహమ్మారి ప్రతిస్పందన, ఆర్థిక ప్రత్యామ్నాయాలు (ఫోర్స్) పేరుతో ప్రభుత్వానికి నివేదికను అందించింది సీబీడీటీలోని భారత రెవెన్యూ సర్వీసెస్​ సంఘం.

కరోనా నేపథ్యంలో స్వల్ప, మధ్యకాలిక చర్యలు తీసుకోవాలని తెలిపింది. మధ్యకాలిక చర్యల్లో భాగంగా విదేశీ సంస్థలపై అధిక పన్ను విధించటం ద్వారా నగదు లభ్యత పెంచుకోవాలని సిఫార్సు చేసింది. రూ.కోటిపైగా ఆదాయం ఉన్నవారికి పన్ను శ్లాబును 30 నుంచి 40 శాతానికి పెంచాలని సూచించింది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కరోనా: వారికి ఆదాయ పన్ను భారీగా పెంపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.