ETV Bharat / business

చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ సాయం ఇలా ఉంటే మేలు! - ఎంఎస్ఎంఈలపై లాక్​డౌన్ ప్రభావం

ఎంఎస్​ఎం​ఈలు.... దేశ ఆర్థిక వ్యవస్థలో అతి కీలకమైనవి. భారీ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలు ఇవే. అయితే లాక్​డౌన్​తో ఎంఎస్​ఎంఈలు కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలోకి జారుకున్నాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినా... మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వ్యాపారులు.

Problems of MSMEs
ఎంఎస్​ఎంఈల సమస్యలు
author img

By

Published : Jun 5, 2020, 6:09 PM IST

దేశంలో వ్యవసాయం అనంతరం ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నది సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే(ఎంఎస్ఎంఈ). 'నేషనల్ సాంపుల్ సర్వే 2015-2016' నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 6.33 కోట్ల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వీటిలో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. దేశ జీడీపీలో కూడా వీటి వాటా కీలకమైనది. 2018-19 లెక్కల ప్రకారం దేశ స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటా 30.30 శాతం.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంఎస్ఎంఈలు పారిశ్రామికంగా, ఉపాధి పరంగా కీలకమైనవి. తెలంగాణలో 26.05 లక్షలు, ఆంధ్రప్రదేశ్​లో 33.87 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. దేశంలోని ఎంఎస్ఎంఈలలో తెలంగాణ వాటా దాదాపు 4 శాతం.

నేషనల్ సాంపుల్ సర్వే 2015-16 నివేదిక ప్రకారం తెలంగాణలో వీటిలో 40.16 లక్షల మంది.. ఆంధ్రప్రదేశ్ లో 55.99 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

సవాళ్ల సాగరంలో ఎంఎస్ఎంఈలు...

సాధారణంగా ఎంఎస్ఎంఈలకు చాలా సవాళ్లు ఉంటాయి. పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల.. క్యాష్ ఫ్లో తగ్గినట్లయితే వాటి కార్యకలాపాలు నిర్వహించటం కష్టం అవుతుంది. ప్రస్తుత లాక్​డౌన్ లాంటి అనూహ్య పరిణామం ఎదురైనప్పుడు అవి వాటి ఉత్పత్తులను విక్రయించటం సాధ్యం కాదు. కుటీర స్థాయిలో ఉన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి.

విదేశాల్లో చిన్న తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు అందించటం ప్రభుత్వాలు సహాయం చేశాయి. అక్కడ అలాంటి పరిశ్రమల సంబంధించి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది కాబట్టి వాటికి సహాయం అందించింది. మన దేశంలో కొన్ని కుటీర పరిశ్రమలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. దీనితో వాటికి ప్రభుత్వం సహాయం అందించటం కష్టంగా మారుతోంది.

ప్రభుత్వ ప్యాకేజీ..

క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంది. రూ.3 లక్షల కోట్ల రుణాలు, ఎంఎస్ఎంఈ పరిధి విస్తరణ, రూ.200 కోట్ల వరకు గ్లోబల్ టెండర్లకు స్వస్తి, మార్కెట్ లింకేజ్ స్కీమ్ తదితర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఈ ప్యాకేజీ ప్రకారం ప్రకటించిన రుణాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఇవ్వటం ప్రకటించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మిగతా బ్యాంకులు కూడా ఇదే పనిలో ఉన్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని, అయితే వడ్డీ రేట్లను కూడ తగ్గించాలని వారు కోరుతున్నారు.

"ప్యాకేజీ ఉపయోగపడుతుంది కానీ.. వడ్డీ రేట్లను తగ్గించటం వల్ల మరింత లాభం చేకూరుతుంది. ఫిక్సెడ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు 5 శాతం వద్ద ఉన్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు 3.5 శాతం ఉన్నాయి. కానీ ఎంఎస్ఎంఈలకు సంబంధించి 7-10 శాతం వడ్డీ ఉంది. వడ్డీ రేట్లను తగ్గించటం కానీ, రద్దు కానీ చేయాలి. కొంచెం పెద్ద పరిశ్రమలకు రద్దు చేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంత మేర రద్దు చేస్తే సరిపోతుంది. చిన్న వ్యాపారులకు మాత్రం మొత్తం రద్దు చేస్తే ఉపయోగపడుతుంది. దీని ద్వారా భారం కూడా ఎక్కువగా ఉండదు."

- అనిల్ రెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు

చిన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి 2-3 విడతల్లో ఎక్కువ సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతున్నారు.

గత రెండు నెలల నుంచి అన్ని పరిశ్రమల లాగే ఇవి మూసి ఉన్నాయి. ఇవి నెల నెల విక్రయాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటికి విద్యుత్ బిల్లు కట్టేందుకు వాయిదా ఇవ్వటం, వడ్డీ సబ్సిడీ లాంటివి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:ఇప్పట్లో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉండవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.