ETV Bharat / business

ఇది 'సూట్‌బూట్‌ బడ్జెట్​'.. పేదలకు కాదు: రాహుల్‌ - రాహుల్​ గాంధీ తాజా వార్తలు

కేంద్ర బడ్జెట్‌లో మెరుగైన ప్రతిపాదనల కోసం వివిధ వర్గాల నిపుణులు, ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. తన సంపన్న స్నేహితుల కోసమే మోదీ ఈ విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నారని దుయ్యబట్టారు.

RAHUL GANDHI
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jan 10, 2020, 6:15 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వివిధ వర్గాల నిపుణులతో మోదీ కొద్ది రోజులుగా మేధోమథన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిపై రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

RAHUL TWEET
రాహుల్​ గాంధీ ట్వీట్

'బడ్జెట్‌పై మోదీ జరుపుతున్న విస్తృత సంప్రదింపులన్నీ తన ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు, సంపన్న వర్గాల కోసమే. మన రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల అభిప్రాయాలు, ఆలోచనలపై ఆయనకు ఎలాంటి ఆసక్తి ఉండదు’ - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

'సూట్‌బూట్‌ బడ్జెట్‌' అని హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ రాహుల్​ ఈ విమర్శలు చేశారు.

వరుస భేటీలు...

మొన్న పారిశ్రామిక వేత్తలను కలిసిన ప్రధాని.. గురువారం ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటలిస్టులు, వ్యాపారవేత్తలు, వ్యవసాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ బలంగా పంజుకునే సామర్థ్యం, సత్తా మనకుందని సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2024 నాటికి ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యం దిశగా అన్ని వర్గాలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Varanasi (Uttar Pradesh), Jan 10 (ANI): Congress general secretary for UP East Priyanka Gandhi met students of Banaras Hindu University and civil society member on Jan 10 in Varanasi. The BHU students and activists were arrested during protests against Citizenship Amendment Act (CAA). Early today, she visited a temple at Panchganga Ghat.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.