భారతీయ వ్యాపార భాగస్వాములతో లావాదేవీలు జరిపే ప్రవాసులు ఇకపై పన్ను పరిధిలోకి రానున్నారు. భౌతికంగా భారత్లో లేకపోయినప్పటికీ.. డిజిటలైజ్డ్గా భారత్లో లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
కేంద్ర ప్రత్యక పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా ఈ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి భారత్లో వ్యాపారాలను సాగిస్తున్న ఎవరైనా రూ.2 కోట్లకు మించి లావాదేవీలు జరిపితే.. వాటిపై పన్ను విధించనుంది సీబీడీటీ.
భారత్లో ఉన్న ఏ వ్యక్తి నుంచైనా ప్రాపర్టీ, వస్తు సేవలు, డేటా డౌన్ లోడ్, సాఫ్ట్వేర్ కొనుగోలు వంటి లావాదేవీలన్నీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి రానున్నాయి.
ఇదీ చదవండి:పన్ను పరిధిలోకి గూగుల్, ఫేస్‌బుక్!