ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్లపై అపోహలా? అయితే ఇది మీకోసమే - మ్యూచులవల్ ఫండ్లకు క్రికెటర్ల ద్వారా అవగాహన

సిక్స్‌, ఫోర్‌, వికెట్‌, సెంచరీ, హాఫ్‌ సెంచరీ.. ఇవి ఐపీఎల్‌లో సాధారణంగా వినపడే పదాలు. ఈ సారి వీటితో పాటు మ్యూచువల్‌ ఫండ్లు అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కడ? ఎప్పుడూ? ‌అనుకుంటున్నారా! ఇది ఆటలో కాదు.. ఆట మధ్యలో వచ్చే విరామంలో. టాప్‌ భారత క్రికెటర్లు మ్యూచువల్ ఫండ్ల ప్రచారంలో ఉన్నారు. మ్యూచువల్‌ ఫండ్లపై ఉన్న కొన్ని అపోహలపై వీరు అవగాన కల్పిస్తున్నారు. వీటితో పాటు మ్యూచవల్ ఫండ్లలో ఉండే సాధారణ అపోహలు, సందేహాలకు సమాధానంగా.. ఓ ప్రత్యేక కథనం మీ కోసం.

Awareness by cricketers on myths in mutual funds
మ్యూచువల్ ఫండ్లపై క్రికెటర్ల అవగాహన ప్రకటనలు
author img

By

Published : Oct 2, 2020, 4:17 PM IST

ధోని, బుమ్రా, రోహిత్ శర్మ, శ్రేయష్‌ అయ్యర్‌.. ఇలా టాప్‌ క్రికెటర్లంతా మ్యూచువల్‌ ఫండ్ల బాట పట్టారు. అదేమిటి.. వాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు కదా? అని అనుకుంటున్నారా? క్రికెట్ అభిమానులకు ఐపీఎల్‌ ద్వారా మంచి థ్రిల్‌ ఇస్తున్న వీళ్లే.. విరామంలో ప్రకటనల ద్వారా మ్యూచువల్‌ ఫండ్లపై ఉన్న కొన్ని అపోహలపై అవగాహన కల్పిస్తున్నారు.

మరి మ్యూచువల్‌ ఫండ్లలో ఉన్న సాధారణ అపోహలు ఏమిటి? వాటిలో నిజమెంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహలు ఇలా

కొత్తగా పెట్టుబడి పెట్టాలనకునే వారికి చాలా మంది మ్యూచువల్‌ ఫండ్లను సూచిస్తుంటారు. అయితే దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీటిలో పెట్టుబడి పెట్టాలన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వీటితో పాటు నెట్ అసెట్ వాల్యూ, రేటింగ్‌ తదితర అంశాల్లో చాలా మందికి అపోహలు ఉన్నాయి.

ఈక్విటీలపై అవహగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి

మ్యూచువల్‌ ఫండ్లు నిపుణులకు సంబంధించిన అంశం! మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యక్తిగతంగా ఈక్విటీపై నిపుణత అవసరం లేదు. మ్యూచువల్‌ ఫండ్లను ఈక్విటీకి సంబంధించిన నిపుణులు నిర్వహిస్తారు. లోతైన పరిశోధన అనంతరం.. డబ్బును పెట్టుబడులు పెడతారు. కాబట్టి మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెట్టే సాధారణ వ్యక్తులకు నిపుణత అవసరం లేదు.

మ్యూచువల్‌ ఫండ్లు దీర్ఘకాలానికి మాత్రమే సంబంధించినవి?

ఇది సాధారణ ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే ఈ వాదనలో నిజం లేదు. అవసరానికి అనుగుణంగా స్వల్ప, దీర్ఘకాలానికి మ్యూచువల్‌ ఫండ్లను తీసుకోవచ్చు.

పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌ ఫండ్లలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పెట్టుబడులు పెడతాయి. స్వల్ప కాలానికి సరిపోయే ఫండ్లను తీసుకున్నట్లయితే కొన్ని రోజులు, వారాలు, సంవత్సరాల వ్యవధికి సరిపోయే ఫండ్లను ఎంపిక చేసుకోవచ్చి.

ఫండ్ల రకాలు ఇలా..

లిక్విడ్‌ ఫండ్లు స్వల్ప కాలిక ఫండ్లు- ఇవి 91 రోజుల లోపల మెచ్యూర్డ్‌ అవుతాయి. ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్లు కూడా స్వల్ప కాలానికి సరిపోతాయి.

మధ్యస్థ కాలానికి సరిపడే విధంగా 3 సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్డ్‌ అయ్యే ఫండ్లూ ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వ్యవధిలో ఉండే విధంగా కూడా మ్యూచువల్‌ ఫండ్‌ను తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లు దీర్ఘకాలానికి సరిపోతాయి. అదే సమయంలో డెట్‌ ఫండ్ల స్వల్ప కాలానికి సరిపోతాయి.

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టటం అనేది స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టటం లాంటిదే?

మ్యూచువల్‌ ఫండ్లు కేవలం స్టాక్‌ మార్కెట్లో మాత్రమే పెట్టుబడి పెట్టవు. ఈక్విటీ సహా బాండ్లు (కార్పోరేట్‌ బాండ్లు, ప్రభుత్వం బాండ్లు).. ట్రెజరీ బిల్లులు, కమర్షియల్‌ పేపర్లు, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్ వంటి మనీ మార్కెట్‌ ఆఫరేషన్లలో పెట్టుబడులు పెడతాయి. వీటిలో వ్యక్తిగతంగా మదుపు చేయాలంటే భారీ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. కాబట్టి మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా వీటిలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఎక్కువ ఎన్ఏవీ ఉన్న వాటికంటే తక్కువ ఎన్‌ఏవీ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడికి మంచిది?

ఇది చాలా మందిలో ఉన్న ఆపోహ. మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్‌ వాల్యూ) అనేది అంతర్లీనంగా ఉండే పెట్టుబడుల మార్కెట్ విలువను సూచిస్తుంది. వాటి గమనాల ఆధారంగానే ఎన్ఏవీ గమనం ఉంటుంది. రూ.10 వేలు రెండు భిన్నమైన ఎన్‌ఏవీలు గల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారనుకోండి. అందులో ఒకదాని ఎన్ఏవీ రూ.50, మరోదాని ఎన్ఏవీ రూ.100 అనుకుంటే.. మొదటి దానిలో 200 యూనిట్లు, రెండో దానిలో 100 యూనిట్లు వస్తాయి.

రెండింటి అంతర్లీన పెట్టుబడులు సమానమే అనుకుంటే.. 10 శాతం వృద్ధి నమోదైనప్పుడు మొదటి దాని ఎన్ఏవీ రూ.5 రూపాయల పెరగగా రెండో దాని ఎన్ఏవీ రూ.10 పెరుగుతుంది. మొత్తం మీద పెరుగుదల రెండింటిలో రూ.1000 రూపాయలుగా ఉంటుంది. కాబట్టి ఎన్ఏవీతో రాబడిపై ప్రభావం ఉండదు.

మరిన్ని..

ఎక్కువ ఎన్‌ఏవీ ఉన్న ఫండ్.. గరిష్ఠ స్థానానికి చేరుకున్నట్లేనని కూడా చాలా మందిలో ఉన్న అపోహ. స్టాక్ మార్కెట్లతో మ్యూచువల్ ఫండ్లకు ఉన్న అనుసంధానం దృష్ట్యా చాలా మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఎన్ఏవీ మార్కెట్ విలువను తెలుపుతుంది. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. స్టాక్​ మార్కెట్ల పరిస్థితి అధారంగా ఎన్‌ఏవీ మారుతుంటుంది.

ఒక స్టాక్ విలువ గరిష్ఠానికి చేరిందని ఫండ్ మేనేజర్‌ భావించినట్లైతే.. ఆయన వాటిని విక్రయించవచ్చు. ఎన్‌ఏవీ విలువ ఆధారంగా ఫండ్ గరిష్ఠానికి చేరుకున్నట్లు కాదు. అధిక ఎన్ఏవీ మంచి ప్రదర్శనను సూచిస్తుంది. మంచి రేటింగ్ ఉన్న ఫండ్ ద్వారా మంచి రాబడి అర్జించవచ్చు. మ్యూచువల్ ఫండ్ రేటింగ్‌లు మారుతుంటాయి. ప్రదర్శన, రిటర్నులు సహా పలు ఇతర ఆధారంగా రేటింగ్‌ నిర్ణయమౌతుంది. ప్రదర్శన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.

ప్రస్తుతం టాప్‌ రేటింగ్‌తో ఉన్న మ్యూచువల్ ఫండ్​కు భవిష్యత్​లో అదే రేటింగ్‌ కొనసాగకపోవచ్చు. గత ప్రదర్శన ప్రకారం భవిష్యత్తులో రాబడులు ఉంటాయన్నది లేదు. అయితే పెట్టుబడికి సంబంధించి మంచి రేటింగ్ ఉన్న ఫండ్లను పరిగణనలోకి తీసుకోవడం మంచిదే.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా కావాలన్న అపోహ కూడా చాలా మందికి ఉంది. అయితే స్టాక్స్​లో ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతున్న వారికి మాత్రమే డీమ్యాట్ ఖాతా కావాలి. మ్యూచువల్ ఫండ్స్​కు అవసరం లేదు.

ఇదీ చూడండి:అక్టోబర్​ 16 నుంచి కేంద్ర బడ్జెట్​​ ప్రక్రియ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.