ETV Bharat / business

'ఆర్​బీఐ చర్యలతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ'

author img

By

Published : May 22, 2020, 10:13 PM IST

కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడమే కాకుండా టర్మ్​లోన్​ మారటోరియాన్ని పొడిగించింది. ఆర్​బీఐ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఊతమిస్తుందన్నారు ఎస్​బీఐ ఛైర్మన్​ రజనీశ్​ కుమార్​.

RBI's announcements to fight economic crisis
'ఆర్​బీఐ చర్యలతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ'

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన సమీక్ష అనంతరం వడ్డీ రేట్లపై కోత విధిస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్​ శక్తికాంత దాస్​. రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. రెపోరేటు 4.40 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది ఆర్​బీఐ. రివర్స్​ రెపోరేటును 3.35 శాతానికి పరిమితం చేసింది. ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు నేతలు, పరిశ్రమ వర్గాలు.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు, టర్మ్​లోన్స్​పై మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంతో.. ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఛైర్మన్​ రజనీశ్​ కుమార్​. మారటోరియం పొడిగింపుతో పరిశ్రమ వర్గాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. మూడు నెలల మారటోరియాన్ని ఇప్పటి వరకు 20 శాతం మంది ఎస్బీఐ రుణగ్రహీతలు వినియోగించుకున్నట్లు తెలిపారు.

డిమాండ్​ను పునరుద్ధరిస్తుంది..

ఆర్​బీఐ అనూహ్యంగా కీలక వడ్డీ రేట్లను తగ్గించటం చిన్న వ్యాపారాలకు ఉపశమనం కల్పిస్తుందని పేర్కొన్నాయి పరిశ్రమ వర్గాలు. డిమాండ్​ను పునరుద్ధరిస్తుందని తెలిపారు. ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం, ఆర్​బీఐ నుంచి మరింత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు ఫిక్కీ అధ్యక్షులు సంగీత రెడ్డి. విధానకర్తలు, రెగ్యులేటర్లను సమన్వయపరుస్తూ పనిచేస్తామన్నారు.

మారటోరియం పొడిగింపును ఎన్​బీఎఫ్​సీలకు కూడ వర్తించేలా చూడాలన్నారు సీఐఐ డైరెక్టర్​ జనరల్​ చంద్రజిత్​ బెనర్జీ. అలా చేయనిపక్షంలో ఎన్​బీఎఫ్​సీలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తాయని పేర్కొన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న వ్యాపారాలు ఉపశమనం పొందేలా రుణాల రీస్ట్రక్చరింగ్​కు అనుమతించాలన్నారు. రుణదాతలకు గ్రూప్​ ఎక్స్​పోజర్​ పరిమితి 25 శాతం నుంచి 30 శాతానికి పెంచటం స్వాగతించే చర్యగా తెలిపారు.

లాక్​డౌన్​తో దెబ్బతిన్న అన్ని రంగాలకు నిధులు సమకూరేలా, ప్రైవేటు వినియోగాన్ని పెంచడానికి ఆర్​బీఐ నిరంతర చర్యలు సహాయపడతాయి. లాక్​డౌన్​తో నిలిచిపోయిన డిమాండ్​ను పునరుద్ధరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అసోచామ్​ అధ్యక్షుడు నీరంజన్​ హిరనందని.

పటిష్ఠంగా ఆర్థిక వ్యవస్థ

వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుచూపునకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా ఉంచుతుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.