ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 1.3 శాతంగా నమోదు కావొచ్చని డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. పూర్తి సంవత్సరానికి మాత్రం వృద్ధి రేటు -6.8 శాతంగా నమోదు కావచ్చని తెలిపింది. 2021-22లో భారత వృద్ధి రేటు 10.5 శాతంగా నమోదవ్వచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో జీడీపీ 24%, 7.5% మేర ప్రతికూల వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రజల వ్యయాలు పెరగడం వల్ల వృద్ధి సానుకూలంగా నమోదు కావొచ్చని పేర్కొంది డీబీఎస్. వచ్చే శుక్రవారం మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇదీ చదవండి:వంటింట్లో మంటలు- సలసల కాగుతున్న నూనె ధరలు