భారత వృత్తి నిపుణులు 2021కి ఆశావాదంతో స్వాగతం పలుకుతున్నట్లు లింక్డ్ఇన్ తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని వృత్తి నిపుణులు ఆశిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 21,066 మంది వృత్తి నిపుణులపై ఆన్లైన్లో జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడించింది లింక్డ్ఇన్.
లింక్డ్ఇన్ సర్వే ముఖ్యాంశాలు..
- ప్రతి ఐదుగురిలో ఇద్దరు(40 శాతం) భారత వృత్తి నిపుణులు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పెరుగాతాయని ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు వచ్చే ఏడాది ఆరు నెలల్లో తమ కంపెనీలు మెరుగ్గా రాణించాలని భావిస్తున్నారు.
- ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసం (ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య) 50-57 వద్ద స్థిరంగా ఉంది.
- భారతీయ వృత్తి నిపుణుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు (57 శాతం).. రానున్న రోజుల్లో ఆన్లైన్ ద్వారా కొత్త నైపుణ్యాలు పెంచుకునే సమయం పెంచుకోనున్నట్లు వివరించారు.
- నవంబర్ డేటా ప్రకారం ఐదుగురిలో నలుగురు ఉపాధి లేని వృత్తి నిపుణులు (78 శాతం) ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. 32 శాతం మంది మాత్రమే (ముగ్గురిలో ఒకరు) వచ్చే ఏడాది తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
- ఈసారి సెలవు సీజన్లో 61 శాతం మంది వృత్తి నిపుణులు తక్కువ సమయం విరామం తీసుకుంటామని చెబుతున్నారు. 87 శాతం మంది (10లో 9 మంది) ఈ ఏడాది చివర్లో తమ ప్రాథమిక పనులకు సమాన సమయం గానీ కాస్త ఎక్కువగానీ కేటాయిస్తామని వివరించారు.
ఇదీ చూడండి:4 షరతుల పూర్తికి మరో రెండు నెలల గడువు