ETV Bharat / business

'సానుకూలతలు కనిపిస్తున్నాయ్​- ఇదే సంకేతం' - కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి

దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు. 'వి' ఆకారపు రికవరీ కోసం దేశం ఎదురు చూస్తోందని తెలిపారు. సాంకేతిక మాంద్యం నుంచి దేశం కోలుకుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Indian economy looking at 'V-shaped' recovery: Anurag Thakur
'సానుకూలతలు కనిపిస్తున్నాయ్​'
author img

By

Published : Mar 14, 2021, 9:38 AM IST

ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాల్లో ఇప్పటికే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని, దేశం 'వి' ఆకారపు రికవరీ కోసం ఎదురుచూస్తోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో రూ.25,787 కోట్ల విదేశీ పోర్ట్​ఫోలియో నిధులు(ఎఫ్​పీఐ) తరలిరావడాన్ని ఆయన ఉదహరించారు.

పెరిగిన విదేశీ మారక నిల్వలు..

ముంబయిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్​గా​ మాట్లాడిన మంత్రి.. రెండు వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించిన తర్వాత అక్టోబరు-డిసెంబరులో 0.4శాతం వృద్ధిని సాధించి సాంకేతిక మాంద్యం నుంచి దేశం బయటపడిందని తెలిపారు. దేశ విదేశీ మారక నిల్వలు గత కొద్ది నెలలుగా స్థిరంగా పెరుగుతున్నాయని, 2021 జనవరిలో ఆల్​టైం గరిష్ఠ స్థాయి అయిన 590 బిలియన్​ డాలర్ల మేర పెరిగినట్లు తెలిపారు.

'ఈ సానుకూల సంకేతాలు విశ్వాసాన్ని ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫండ్​లు, పెట్టుబడుదార్లు మన దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా భావిస్తున్నాయి. భారత వృద్ధిపై బులిష్​(ఆసక్తి)గా' ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: జీడీపీతో పోలిస్తే 267 శాతం అధికంగా అప్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.