ETV Bharat / business

బడ్జెట్​ 2021-22: ఎన్నో ఆశలు.. మరెన్నో సవాళ్లు - బడ్జెట్ అప్​డేట్స్

కరోనా కష్టనష్టాల మధ్య సోమవారం వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొవిడ్ వల్ల అన్ని రంగాలు తీవ్రంగా కుదేలైన నేపథ్యంలో బడ్జెట్​పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సారి బడ్జెట్​ నుంచి ఏఏ రంగాలు ఎలాంటి ఉద్దీపనలు కోరుతున్నాయి? ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి? అనే అంశంపై నిపుణుల విశ్లేషణ మీ కోసం.

various categories Expectations budget
బడ్జెట్​పై వివిధ వర్గాల అంచనాలు
author img

By

Published : Jan 31, 2021, 4:38 PM IST

Updated : Jan 31, 2021, 5:09 PM IST

దేశ ఆర్థిక పురోభివృద్ధి గమనాన్ని నిర్ణయించేది కేంద్ర బడ్జెట్. బడ్జెట్​ అంటే అన్ని రంగాల్లో ఆశలు, అంచనాలు సహజమే. అయితే ఈ సారి బడ్జెట్​.. భిన్నంగా ఉండనుంది. కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన ప్రత్యేక పరిస్థతుల్లో ఈ సారి బడ్జెట్ వస్తుండటమే ఇందుకు కారణం.

ఈ సారి పద్దులో డిమాండ్​ పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకుంటారని భారీ అంచనాలు ఉన్నాయి. ఆదాయపు పన్నులో ఊరట కలిగించాలని వేతనజీవులు కోరుతుంటే.. డిమాండ్ పెంచాలని, చిక్కుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని పరిశ్రమలు, సంస్థలు సూచిస్తున్నాయి.

కొవిడ్ మూలంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వివిధ వర్గాల్లో బడ్జెట్ పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వైద్యరంగానికి పెద్దపీట!

బడ్జెట్​లో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. కరోనా వల్ల ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, పరిశోధన ఇతరత్రా అంశాల్లో వ్యయం పెంచాల్సిన పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణం. 2022 వరకు జీడీపీలో 3 శాతం వైద్య రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నందున.. ఈ సారి బడ్జెట్ లో ఈ రంగంపై కేటాయింపులు జీడీపీలో 2 నుంచి 2.5 శాతం వరకు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2020-21 కూడా దీనినే సిఫారసు చేసింది.

ఆదాయపు పన్ను తగ్గింపు?

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఉపకరించేలా డిమాండ్ పెంచేందుకు ఆదాయపు పన్నులో మరింత ఊరట కలిగించే నిర్ణయాలు ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు ప్రస్తుతం ఉన్న రూ.50వేల స్థాయి నుంచి పెరుగుతుందని భావిస్తున్నారు.

పెరిగిన వైద్యారోగ్య ఖర్చుల దృష్ట్యా.. సెక్షన్ 80డీ డిడక్షన్స్ పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గృహ రుణాలు, సెక్షన్ 80సీ విషయంలో డిడక్షన్ పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ట్యాక్స్ డిడక్టబుల్ ఇన్ ఫ్రా బాండ్లు ప్రవేశపెట్టొచ్చని కూడా నిపుణులు అంటున్నారు.

వాహన రంగం ఆశలు..

వాహన రంగానికి సంబంధించి ఇప్పటికే స్క్రాప్ పాలసీని కేంద్రం ప్రకటించింది. దీని అమలుపై ప్రభుత్వం ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు వాహన రంగం భావిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వాహన రంగంపై దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలని అనుకుంటోంది.

విద్యుత్ వాహనాలకు అధిక కేటాయింపులు?

ఎలక్ట్రానిక్ వాహనాల విషయంలో ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈవీలకు మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్ల లాంటి వాటిపై ప్రభుత్వం కేటాయింపులు చేయాలని పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.

2030 నాటికి దేశంలో విక్రయమయ్యే వాహనాల్లో 30 శాతం ఈవీ ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యం నిర్దేశించుకుంది.

మౌలిక రంగానికి కేటాయింపులు తగ్గుతాయా?

మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కేటాయింపులు 2021 బడ్జెట్ తో పోల్చినట్లైతే తగ్గే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి అవాస్ యోజనకు కేటాయింపులు పెరుగుతాయని నిపుణులు ఆశిస్తున్నారు.

దేశీయ తయారీకి ప్రోత్సాహం..

పరిశ్రమ పరంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకం మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆ రంగ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ దిశగా ప్రకటన వెలువరిచే అవకాశం ఉంది.

దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కొత్తగా కొవిడ్ సెస్?

కొవిడ్ మూలంగా ప్రభుత్వం వ్యయం పెరిగిపోయింది. బడ్జెట్లో టీకా కోసం కేటాయింపులు ఉంటాయన్న విశ్లేషణ ఉంది. ఈ ఖర్చును భర్తీ చేసేందుకు.. ప్రభుత్వం ఈ సారి కొవిడ్ సెస్ లేదా సర్ ఛార్జ్ విధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్​లో 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సౌర, పవన, బయో, హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే 140 గిగా వాట్ల స్థాయికి చేరుకున్నట్లు అంచనా. లక్ష్య సాధన కోసం ఇందుకు మరిన్ని కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.

చిన్న సంస్థలకు మరింత ఉపశమనం!

ఎంఎస్ఎంఈల విషయంలో ఏకకాల రుణ పునర్ వ్యవస్థీకరణ మార్చి 31తో ముగియనుంది. ఈ గడువు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భావనలో ఆ పరిశ్రమ ప్రతినిధులు ఉన్నారు.

Last Updated : Jan 31, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.