ETV Bharat / business

2021-22లో ఆర్​బీఐ ఎంపీసీ తొలి సమీక్ష హైలైట్స్ - ప్రస్తుత రెపో రేటు

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్​బీఐ ఎంపీసీ కమిటీ సర్దుబాటు వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. కీలక వడ్డీ రేట్లను వరుసాగా ఐదోసారీ యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక సమీక్షలో ఎంపీసీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

RBI Governor Das
శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్
author img

By

Published : Apr 7, 2021, 12:41 PM IST

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ బుధవారం ప్రకటించింది. దీనితో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.3 శాతం వద్ద యథాతథంగా ఉండనున్నాయి. వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం వరుసగా ఇది ఐదోసారి. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సమీక్ష ముఖ్యాంశాలు..

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ వృద్ధి రేటు అంచనా 10.5 శాతం
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్దుబాటు వైఖరి కొనసాగింపు
  • 2021-21 ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా. మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పరిమితమయ్యే అవకాశం
  • 2021-22లో తాజా రుణాల కోసం నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ, ఎస్‌ఐడీబీఐకి రూ.50 వేల కోట్ల అదనపు లిక్విడిటీ సౌకర్యం
  • రాష్ట్రాలకిచ్చే స్థూల చేబదుళ్ల(వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌) పరిమితిని రూ.47,010 కోట్లకు పెంపు
  • కొవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకు మధ్యంతర రూ.51,560 కోట్ల చేబదుళ్ల కాలపరిమితిని సెప్టెంబరు వరకు పొడిగింపు
  • వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండేలా ఆర్‌బీఐ చర్యలు
  • ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్​సీ)ల పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు
  • పేమెంట్స్ బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాదారుల రోజువారీ నగదు పరిమితి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు

ఇదీ చదవండి:'2021లో 12.5 శాతానికి దేశ జీడీపీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.