ETV Bharat / business

జీఎస్​టీ బకాయిలపై రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్

జీఎస్టీ పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాలకు రెండు మార్గాలను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన పరిహారం రూ. 3 లక్షల కోట్లు కాగా.. ఆదాయం పోను రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతుందని కేంద్రం తెలిపింది. వీటిని ఆర్​బీఐ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది.

GST
జీఎస్​టీ
author img

By

Published : Aug 27, 2020, 7:09 PM IST

జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. గురువారం జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రభుత్వం ఆలోచనల్ని రాష్ట్రాల ముందుంచారు.

వచ్చే ఆదాయం రూ.65 వేల కోట్లు..

2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో రూ.65 వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిర్మల తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కోసం రావాల్సిన ఆదాయంలో రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతోందని వివరించారు.

కరోనా సంక్షోభం..

ఇందులో రూ.97 వేల కోట్ల లోటు జీఎస్​టీ అమలు వల్ల ఏర్పడిందని తెలిపిన ఆర్థిక మంత్రి.. మిగతా మొత్తానికి లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నష్టపరిహారం భర్తీకి ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనలు చేశారు.

1. జీఎస్​టీ అమలు వల్ల ఏర్పడిన లోటు రూ.97వేల కోట్లను ఆర్​బీఐ నుంచి సరసమైన వడ్డీకి రుణం తీసుకోవడం.

2. మొత్తం రూ.2.35వేల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా ఆర్​బీఐ నుంచి రుణంగా పొందడం.

"సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనల గురించి వివరంగా తెలియజేశాం. దీనిపై తమకు సమగ్ర సమాచారం అందించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు ఏడు రోజుల సమయం కావాలని, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామని తెలిపాయి. దీనిపై నిర్ణయం కోసం మళ్లీ స్వల్పకాలిక జీఎస్టీ సమావేశం ఉంటుంది. అక్కడ రాష్ట్రాల అభిప్రాయాల ఆధారంగా పరిహారం చెల్లింపుపై మేం నిర్ణయం తీసుకుంటాం. ఇందుకోసం ఆర్బీఐతో చర్చించి రాష్ట్రాలు ద్వైమాసిక జీఎస్టీ పరిహారం పొందేలా చర్యలు తీసుకుంటాం."

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

అయితే ఈ వెసులుబాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ పాండే స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'మొండి బాకీల పరిష్కారానికి 'బ్యాడ్​ బ్యాంక్' తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.