దేశవ్యాప్తంగా అన్‌లాక్‌తో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. అక్టోబర్‌లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,05,155 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇదే ప్రథమం.
గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఈ సారి 10 శాతం పెరిగాయి.
అక్టోబర్ జీఎస్టీ వసూళ్ల లెక్క..
- కేంద్ర జీఎస్టీ - రూ.19,193 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ -రూ.25,411 కోట్లు
- సమీకృత జీఎస్టీ -రూ.52,540 కోట్లు
- సెస్- రూ.8,011 కోట్లు
ఇదీ చూడండి:'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'