దేశంలోని 8 కీలక రంగాల్లో జులై నెలలో వృద్ధిరేటు మందగించింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల కారణంగా 8 కీలక రంగాల్లో వృద్ధి రేటు 2.1 శాతానికి పరిమితమైంది.
గత సంవత్సరం
గత ఏడాది జులైలో 8 కీలక రంగాల్లో 7.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. బొగ్గు, సహజవాయువు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌రంగాలు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రతికూల వృద్ధి రేటు
బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తుల రంగాల్లో జులై నెలలో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఉక్కు, సిమెంట్, విద్యుత్‌రంగాల్లో వృద్ధి 6.6, 7.9, 4.2 శాతంగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ మూడు రంగాలు తక్కువ వృద్ధి నమోదు చేశాయి.
ఇదీ చూడండి:'ఆధార్ ఉంటే పాన్ కార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది'