ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆయా ఉద్యోగులకు పెన్షన్ పెంచుతున్నట్లు (bank employees family pension) కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేవాశిష్ పాండా వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం పెంచనున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.9,284 ఉన్న పెన్షన్ రూ.30-35 వేలకు పెరగనుంది. దీనితో పాటు న్యూ పెన్షన్ స్కీమ్‌లో (ఎన్పీఎస్) (Public sector bank employees pension scheme) యాజమాన్య చందా వాటాను వేతనంలో 10 నుంచి 14 శాతానికి పెంచాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
ఇదీ చదవండి: చెరకు కనీస కొనుగోలు ధర రూ.290