ETV Bharat / business

'2020-21లో జీడీపీ క్షీణత 7.4 శాతమే' - ఎస్​బీఐ జీడీపీ అంచనాలు

దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానిన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు ఎస్​బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను -10.9 శాతం నుంచి -7.4 శాతానికి సవరించింది.

SBI GDP CONTRACT REPORT
ఎస్​బీఐ జీడీపీ క్షీణత అంచనాలు
author img

By

Published : Dec 16, 2020, 1:05 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు క్షీణత 7.4 శాతంగా నమోదవ్వొచ్చని భారతీయ స్టేట్​ బ్యాంక్ (ఎస్​బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేసిన నివేదికలో.. 2020-21లో భారత వృద్ధి రేటు -10.9 శాతం ఉండొచ్చని ఎస్​బీఐ అంచనా వేయడం గమనార్హం.

ఊహించినదానికన్నా మెరుగ్గా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి రేటు క్షీణత అంచనాలను ఎగువకు సవరించినట్లు ఎస్​బీఐ నివేదిక పేర్కొంది. ఈ సానుకూలతల ఆధారంగా 2021-22లో భారత్ ఏకంగా 11 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసే పరిశ్రమ, సేవా రంగం పనితీరు సహా మొత్తం 41 సూచీల ఆధారంగా వృద్ధి రేటును అంచనా వేసినట్లు వివరించింది ఎస్​బీఐ నివేదిక. మొత్తం 41 సూచీల్లో 58 శాతం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు నమోదవుతుందని సూచించినట్లు వెల్లడించింది. క్యూ4 అంచనాలూ సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. అయితే కరోనా విజృంభణ మళ్లీ పెరిగితే ఈ అంచనాల్లో మార్పులు ఉండొచ్చని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.