ETV Bharat / business

కరోనా కాలంలో అప్పు కావాలా? సులువైన మార్గాలివే..

కరోనా కాలంలో చాలా మందికి ఆదాయం తగ్గింది. ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా తెచ్చిన ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా అవసరానికి కావాల్సిన డబ్బును సమకూర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి ఇప్పుడే.

how to get loans on investments
పెట్టుబడులపై రుణాలు పొందడం ఎలా
author img

By

Published : Jul 13, 2020, 2:04 PM IST

కరోనా సంక్షోభం చాలా మంది జీవితాలను తలకిందులు చేసింది. ఉద్యోగం చేస్తున్నా.. కంపెనీలు జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఆదాయం తగ్గినంత మాత్రాన ఖర్చులు తగ్గవు కదా! ఎలాంటి పరిస్థితులు ఉన్నా సాధారణ ఖర్చులు ఉండనే ఉంటాయి. ఇలాంటి సంక్షోభం మళ్లీ ఎప్పుడైనా రావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉంటే ఏమిటవి?

పెట్టుబడులపై రుణాలు..

దీర్ఘకాలిక అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంటారు చాలా మంది. ప్రస్తుతం ఏర్పడిన అవసరాలను తీర్చుకునేందుకు..పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండానే ఆదాయం పొందొచ్చు.

స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్​ ఫండ్లు, బాండ్లను తనఖా పెట్టడం ద్వారా రుణాలు ఇస్తుంటాయి పలు రుణ సంస్థలు. పెట్టుబడుల విలువ ఆధారంగా రూ.కోటి నుంచి రూ.20 కోట్ల వరకు వీటి ద్వారా రుణాలు పొందొచ్చు. కనీస రుణ లభ్యత రూ.50 వేలుగా ఉంది. రుణ పరిమితి మీరు తాకట్టు పెట్టే పెట్టుబడులలో 50 నుంచి 80 శాతం వరకు ఉంటుంది.

ప్రస్తుతం బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు పూర్తిగా డిజిటల్ రూపంలో సేవలందిస్తున్నాయి. అందువల్ల ఇంట్లో నుంచే సలభంగా ఇలాంటి రుణాలు పొందొచ్చు.

చిన్న చిన్న పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, గోల్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి కూడా రుణాలు పొందొచ్చు.

సాధారణంగా ఇలాంటి రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏడాది గడువు విధిస్తుంటాయి రుణ సంస్థలు. వడ్డీ రేటు 8 నుంచి 10 శాతం వరకు(రుణ సంస్థలనుబట్టి మారొచ్చు) ఉంటుంది.

loans on ivestments
పెట్టుబడులపై రుణాలు

పీపీఎఫ్, బీమాలపై రుణాలు..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), జీవిత బీమాలాంటి వాటి ద్వారా కూడా రుణాలు పొందే వీలుంది. పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణాలు పొందేందుకు అవకాశముంది.

పీపీఎఫ్ ఖాతాలో రెండో సంవత్సరం చివరి నాటికి ఉన్న మొత్తంలో 25 శాతానికి సమానంగా ఉంటుంది.

పీపీఎఫ్​పై రుణం తీసుకుంటే ఆ ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ రాదు. పైగా 1 శాతం మీరే అదనంగా (రుణంపై) చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలను తిరిగి చెల్లించేందుకు 36 నెలల వరకు గడువు ఉంటుంది. ఏక మొత్తంలో లేదా ఈఎంఐల రూపంలో ఈ మొత్తాన్ని చెల్లించొచ్చు.

ఇలాంటి రుణాలు పొందేందుకు ఫారం 'డీ' తీసుకుని దగ్గర్లోని పోస్టాఫీసు, బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది.

credit on ppf
పీపీఎఫ్​, బీమాలపై రుణం

ఇళ్లు, కార్​పై రుణం..

మీ ఇళ్లు, కారు లాంటి వాటిని విక్రయించకుండా వాటి ద్వారా మీకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు.

అవసరానికి సరిపడా డబ్బుల కోసం ఇంటిని విక్రయించడం కన్నా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం ఉత్తమం. మీ అవసరం ఇంటి విలువలో 20 నుంచి 40 శాతం ఉంది అనుకుంటే అందుకు ఇది సరైన నిర్ణయమే అవుతుంది.

తాత్కాలిక అవసరాలకు కారును తాకట్టు పెట్టడం ద్వారా కూడా రుణాలు పొందేందుకు అవకాశముంది. సాధారణంగా కార్లపై రూ.లక్ష వరకు అప్పులు ఇస్తుంటాయి రుణ సంస్థలు. కొన్ని బ్యాంకులు ఏకంగా కారు విలువలో 50 శాతం వరకు రుణ సదుపాయం (కారు కండీషన్​ను బట్టి) కల్పిస్తుంటాయి.

ఇప్పటికే మీరు కారు ఇంటిపై రుణం తీసుకుని ఉంటే.. టాప్​ అప్ లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి బ్యాంకులు.

loan on car and home
ఇల్లు, కారుపై రుణాలు

పని చేసే సంస్థ వద్ద అడ్వాన్స్ తీసుకోవడం..

ఆదాయం మార్గాల్లో ప్రధానమైంది ఉద్యోగం. నెలకు మీకు రూ.30 వేలు జీతం వస్తుందని అనుకుందాం. అంటే ఏడాదికి రూ.3.6 లక్షలు. మీ అవసరాలకోసం అందులోంచి కొంత మొత్తం ఒకే సారి తీసుకోవచ్చు.

ఉద్యోగి ఆరు నెలల వేతనాన్ని అడ్వాన్స్​గా తీసుకునేందుకు అనుమతిస్తుంటాయి చాలా కంపెనీలు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు 24 నెలల వరకు గడువు ఇస్తుంటాయి. ఉద్యోగి సంస్థను వీడకుండా ఉండేదుకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంటాయి.

అత్యవసరాలకు మీ సంస్థలే మీకు బ్యాంకులుగా ఉపయోపడతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. చాలా సంస్థలు ఇలా ఉద్యోగి తీసుకున్న అడ్వాన్స్​లపై వడ్డీ కూడా వసూలు చేయవు. సంస్థ వద్ద మీకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి కాబట్టి.. అడ్వాన్స్ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కుడా పట్టదు.

advance at company
సేలరీ అడ్వాన్స్​తో కరోనా కష్టాల నుంచి ఊరట!
  • (రచయిత:కుమార్ శంకర్ రాయ్, సీనియర్ పాత్రికేయులు, పర్సనల్ ఫినాన్స్ నిపుణులు)
  • గమనిక:ఈ కథనంలోని అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వీటితో ఈటీవీ భారత్​కు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కథనం ద్వారా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మరో సారి ఆర్థిక నిపుణుడిని సంప్రదించాలని ఈటీవీ భారత్​ సలహా.
  • పర్సనల్ ఫినాన్స్​పై సందేహాలు తీర్చుకునేందుకు businessdesk@etvbharat.com ను సంప్రదించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.