ఏప్రిల్‌లో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగాయి. గత నెల మొత్తం 30.21 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు ఆదివారం విడుదలైన ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. గత ఏడాది ఏప్రిల్‌లో 10.17 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరిగాయి.
దిగుమతుల్లోనూ..
ఏప్రిల్‌లో 45.45 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 17.09 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది భారత్.
ఎగుమతులు పెరిగినప్పటికీ.. దిగుమతులూ ఎక్కువగా ఉన్న కారణంగా ఏప్రిల్‌లో వాణిజ్యలోటు 15.24 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌తో (6.92 బిలియన్ డాలర్లు) పోలిస్తే వాణిజ్యలోటు 120.34 శాతం అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ డేటా స్పష్టం చేస్తోంది.
మరిన్ని..
- గత నెల 10.8 బిలియన్ డాలర్ల చమురు దిగుమతి జరిగింది.
- రత్నాలు, ఆభరణాలు, జనపనార, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్ వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు గత నెల సానుకూలంగా ఉన్నాయి.