ETV Bharat / business

వేతన జీవులపై కరోనా పిడుగు- 66 లక్షల ఉద్యోగాలు కోత!

author img

By

Published : Sep 18, 2020, 1:44 PM IST

కరోనా వైరస్ కారణంగా వేతన జీవుల్లో.. ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు(వైట్​ కాలర్ ప్రొఫెషనల్స్) అధికంగా ఉపాధి కోల్పోయినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మే-ఆగస్టు మధ్య 66 లక్షల మంది ఉద్యోగాలకు దూరమైనట్లు తెలిపింది. వీరి తర్వాతి స్థానంలో పరిశ్రమల్లో పని చేసే 50 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు సర్వే వివరించింది.

lockdown hit salaried employees badly
వేతన జీవులపై కరోనా పిడుగు

కరోనా​ కట్టడికి విధించిన లాక్​డౌన్​ వల్ల దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉపాధి కోల్పోయిన వేతన జీవుల్లో వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ అధికంగా ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ).. కన్జూమర్​ పిరమిమడ్స్ హౌస్​హోల్డ్ సర్వే ప్రకారం.. మే-ఆగస్టు మధ్య 66 లక్షలు (35 శాతం) మంది వైట్ కాలర్​ వేతన జీవులు ఉపాధి కోల్పోయారు. ప్రతి నాలుగు నెలలకు ఓ సారి ఈ సర్వే గణాంకాలు విడుదల చేస్తుంది సీఎంఐఈ.

వృత్తిపరమైన క్వాలిఫైడ్ ఉద్యోగాల్లో మే-ఆగస్టు మధ్య నియమాకాలు 12.2 మిలియన్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇవి 18.8 మిలియన్​లుగా ఉన్నాయి. ఉద్యోగ గణాంకాలను సీఎంఐఈ ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి (2016).. ఈ స్థాయిలో ఉద్యోగ నియమాకాలు తగ్గటం ఇదే ప్రథమం.

వైట్ కాలర్ ఉద్యోగుల్లో.. ఇంజనీర్లు (సాఫ్ట్​వేర్), ఫిజీషియన్స్, టీచర్లు, అకౌంటెంట్లు, అనలిస్టులు ప్రధానంగా ఉన్నారు. ఈ సర్వేలో స్వయం ఉపాధి పొందుతున్న క్వాలిఫైడ్ వ్యాపారవేత్తల వివరాలను పొందుపరచలేదు.

వీరిపై అంతగా ప్రభావం లేదు..

సెక్రెటరీలు, ఆఫీస్ క్లర్క్, బీపీఓ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి వైట్​ కాలర్ ఉద్యోగాలపై లాక్​డౌన్ ప్రభావం అంతగా లేదని.. సీఎంఐఈ సర్వే పేర్కొంది.

వైట్​ కాలర్ ప్రొఫెషనల్స్ తర్వాత.. అధికంగా ఉపాధి కోల్పోయిన వారిలో పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు ఉన్నట్లు సర్వే తెలిపింది. 2020 మే-ఆగస్టు మధ్య (గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) 50 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయినట్లు సర్వే వివరించింది. ఈ విభాగంలో ఉద్యోగ నియామకాలు 26 శాతం క్షీణించినట్లు పేర్కొంది.

పారిశ్రమిక రంగంలో ఉద్యోగ నష్టం భారీ సంఖ్యలో జరిగినప్పటికీ.. పారిశ్రమికోత్పత్తితో పోలిస్తే ఇది చాలా తక్కువని సర్వే అభిప్రాయపడింది. కేంద్ర గణాంక కార్యాలయం అధికారిక డేటా ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే.. 2020 క్యూ2లో పారిశ్రామికోత్పత్తి 36 శాతం తగ్గినట్లు తెలిసింది.

అయితే కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో నమోదైన గణాంకాలను గత ఏడాదితో లెక్కలతో సరిపోల్చడం సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు.

సర్వే ప్రకారం పెద్ద పరిశ్రమలతో పోలిస్తే.. చిన్న పరిశ్రమల్లో ఎక్కువగా ఉగ్యోగాల కోతలు నమోదైట్లు తెలిసింది.

ఇదీ చూడండి:సెప్టెంబర్ 23న భారత్​లో యాపిల్ ఆన్​లైన్ స్టోర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.