ETV Bharat / business

'వృద్ధి అంచనాలు సానుకూలమే.. కానీ...' - ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

కరోనాతో దెబ్బతిన్న ప్రపంచార్థికం వచ్చే ఏడాది చివరి నాటికి తిరిగి సాధారణ స్థితికి చేరుతుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనా వేసింది. అయితే ప్రస్తుతం అంచనాలు సానుకూలంగా ఉన్నా.. ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేసింది.

Economic outlook by OCED
ప్రపంచార్థికం వృద్ధి రేటు అంచనాలు
author img

By

Published : Dec 1, 2020, 5:15 PM IST

ప్రపంచార్థికం వచ్చే ఏడాది చివరి నాటికి తిరిగి కరోనా సంక్షోభం ముందున్న స్థాయికి చేరుతుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఆశాభావం వేసింది. దేశాల వారీగా ఆర్థిక వ్యవస్థల రికవరీల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తాజాగా వెల్లడించింది. అర్థిక వ్యవస్థపై ప్రస్తుతం సానుకూల అంచనాలు ఉన్నప్పటికీ.. భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేసింది.

సానుకూలతలకు కారణాలు..

వ్యాక్సిన్​ ట్రయల్స్​ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తల వల్ల.. కొవిడ్ సంక్షోభం ప్రారంభమయ్యాక తొలిసారి ఆర్థిక వృద్ధి రేటుపై సానుకూల అంచనాలు వచ్చినట్లు ఓఈసీడీ పేర్కొంది.

ఈ ఏడాది ప్రపంచార్థికం 4.2 శాతం క్షీణతను నమోదు చేస్తుందని.. 2021లో అంతే స్థాయిలో తిరిగి పుంజుకుంటుందని అంచనా వేసింది.

చైనా వాటానే ఎక్కువ..

కరోనాకు పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు కేసులకు అదుపులోకి రావడం వల్ల.. ప్రపంచార్థికం రికవరీలో ఆ దేశం వాటా ఎక్కువగా ఉంటుందని ఓఈసీడీ అంచనా వేసింది. ఐరోపా దేశాలు సహా జపాన్​, అమెరికా భాగస్వామ్యం తగ్గొచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి:మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.