ETV Bharat / business

పన్నుల చెల్లింపు గడువుపై తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు...

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్ తదితర చెల్లింపులపై జూన్ 30 వరకు గడువు పెంచింది.

COVID-19: Know all the tax related extended deadlines
అన్ని పన్ను చెల్లింపులపై గడుపు పెంపు
author img

By

Published : Apr 1, 2020, 11:54 AM IST

కరోనా సంక్షోభం కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్​ ఎక్సైజ్ రిటర్న్​లు తదితర చెల్లింపులపై జూన్​ నెలాఖరు వరకు గడువు పెంచింది.

ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని నిబంధనల సడలింపునకు తీసుకొచ్చిన 2020 ఆర్డినెన్స్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదించారు. వీటితో పాటు పీఎం కేర్స్​ ఫండ్​కు వచ్చిన విరాళాలపై 100శాతం పన్ను తగ్గించేందుకు అంగీకరించారు.

ఈ ఆర్డినెన్స్​ ద్వారా పన్ను చెల్లింపులపై పొడిగించిన కాల పరిమితుల గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

ప్రత్యక్ష పన్ను చెల్లింపులన్నింటికీ జూన్​ 30 వరకు పొడిగింపు

  • ఆదాయపు పన్ను రిటర్న్​లు దాఖలు చేసుకునేందుకు గడువు పెంపు.
  • ఆధార్-పాన్​ లింక్​పై జూన్ నెలాఖరు వరకు గడువు.
  • ఐటీ విభాగాల్లో క్లెయిమింగ్​ డిడక్షన్​పై వివిధ పెట్టుబడులు/ చెల్లింపులకు మినహాయింపు.
  • ఐటీ చట్టంలోని 54, 54 జీబీ సెక్షన్ల కింద మూలధన లాభాలకు సంబంధించి పెట్టుబడి, నిర్మాణం,కొనుగోలు చేసే గడువు పెంపు.
  • సెజ్ యూనిట్లకు పనులు ప్రారంభించే తేదీ పొడిగింపు.
  • వివిధ ప్రత్యక్ష పన్నులపై అధికారులు నోటీసులు జారీ చేసే తేదీ పెంపు- బినామీ చట్టానికి కూడా సడలింపు.
  • వివాద్ సే విశ్వాస్ పథకం కింద ఎటువంటి అదనపు చెల్లింపు లేకుండానే జూన్​ 30 వరకు చెల్లింపులు జరిపే వీలు.

పరోక్ష పన్నులకూ ఇంతే...

  • మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చేయాల్సిన సెంట్రల్ ఎక్సైజ్ రిటర్న్ చెల్లింపులకు గడువు పెంపు.
  • ఎక్సైజ్ చట్టం 1944 కింద అప్పీల్ దాఖలుకు, అప్లికేషన్ వాపసు తీసుకుకోవడానికి జూన్​ నెలాఖరు వరకు అనుమతి.
  • కస్టమ్స్ చట్టం 1962 కింద అప్పీల్ దాఖలుకు, అప్లికేషన్ వాపసు కోసం గడువు పొడిగింపు.
  • సర్వీస్ టాక్స్​కు సంబంధించి అప్పీలు దాఖలుకు గడువు పెంపు.
  • సబ్​కా వికాస్ పథకం కింద ప్రయోజం పొందేందుకు చెల్లింపు చేసే తేదీకి జూన్ 30కి మార్పు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.