ETV Bharat / business

ఉల్లి ఘాటు తీరిందో లేదో.. ఇక వంట నూనెల మంట! - వ్యాపార వార్తలు

వంట నూనెల ధరలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉల్లి ధరల ఘాటు తర్వాత.. వంట నూనెల ధరలు పెరుగతుండటం వల్ల సామాన్యులపై మరింత భారం పడే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల్లో లీటరు వంట నూనెపై రూ.20 పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

OIL PRCE
వంట నూనెల మంట
author img

By

Published : Dec 21, 2019, 1:42 PM IST

దేశంలో నిత్యవసరాల ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన తర్వాత ఇప్పుడు వంట నూనెల ధరలు ఖరీదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై సుంకాలు పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వంట నూనెల ధరల పెంపు ఇలానే కొనసాగితే.. వినియోగదారులపై మరింత భారం తప్పదంటున్నాయి.

పామ్​ ఆయిల్ ధర రెండు నెలల్లో లీటరుకు రూ.20 పెరిగింది. దీని ప్రభావం ఇతర వంట నూనెలపై పడింది. ఈ కారణంగా వాటి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

"పామ్ ఆయిల్​ ధరలు పెరిగిన కారణంగా.. ఇతర వంట నూనెల ధరలు పెరిగాయి. మలేసియా, ఇండోనేసియాల నుంచి వంట నూనెల దిగుమతి ధరలు పెరగటమే ఇందుకు ప్రధాన కారణం. మున్ముందు వంట నూనెల ధరలు ఇంకా పెరిగే అవకాశముంది." - సలిల్​ జైన్, ఆయిల్​ సీడ్ మార్కెట్ నిపుణుడు

అయితే వంట నూనెల్లో మనం స్వయం సమృద్ధిగా మారాలంటే.. దేశంలో రైతుల పంటలకు మద్దతు ధర ఇవ్వాలని మరో పరిశ్రమ నిపుణుడు సూచిస్తున్నారు.

"అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వంట నూనెల దిగుమతి ధరలు పెరగటం కారణంగా దేశంలో ధరలు పుంజుకుంటున్నాయి. అయినప్పటికీ రైతులు ప్రస్తుతం అధిక ధరలో నూనె గింజలను కొంటున్నారు. మనం వారిని ఎక్కువగా నూనె గింజలు పండించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరముంది." - బీ.వీ.మెహతా, సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ ఆసోసియేషన్​ ఆఫ్ ఇండియా

అతిపెద్ద దిగుమతిదారుగా..

వంట నూనెలకు భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. దేశీయ వంట నూనెల అవసరాలకు ఎక్కువ శాతం దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. అయితే మున్ముందు మరింత ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడే అవకాశముందని నిపుణుల అంచనా. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట చాలా వరకు దెబ్బతింది. ఈ కారణంగా ఈ ఏడాది రబీ సీజన్​లో అంచనాలకన్నా తక్కువ సోయా సాగు జరిగినట్లు తెలుస్తోంది.

సుంకాల భారం..

మరీ ముఖ్యంగా అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకునే సోయా నూనెలపై పెరుగుతున్న ఎగుమతి సుంకాల భారంతో.. వంట నూనెల ధరల వృద్ధికి కారణమయ్యే అవకాశముంది. అర్జెంటీనా ఇంతకు ముందు 25 శాతంగా ఉన్న ఎగుమతి సుంకాన్ని 30 శాతానికి పెంచింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజిలో ముడి పామ్ ఆయిల్​ (సీపీఓ) డిసెంబర్​ కాంట్రాక్టు.. సెప్టెంబర్​ 24న 10 కిలోలకు రూ.543.2కు పడిపోయింది. డిసెంబర్​ 20 నాటికి ఇది రూ.744కు చేరింది. దాదాపు రెండు నెలల్లో సీపీఓ 37 శాతం పెరిగింది.

సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ డేటా ప్రకారం..

వెజిటేబుల్ నూనెల (వంట నూనెలు, ఇతర నూనెలు) దిగుమతి నవంబర్​లో 11,27,220 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో దిగుమతులు 11,33,893 టన్నులుగా ఉండటం గమనార్హం.

గుజరాత్​లోని కండ్లా పోర్టులో.. సీపీఓ ధర డిసెంబర్ 20న టన్నుకు 757 డాలర్లుగా, మలేసియా నుంచి దిగుమతి చేసుకున్న ఆర్​బీడీ పామోలిన్ ఆయిల్​ ధర టన్నుకు 782 డాలర్లుగా, సోయా టన్నుకు 878 డాలర్లుగా, ముడి కుసుమ నూనె ధర టన్నుకు 847 డాలర్లుగా ఉంది.

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం..

  • ఈ ఏడాది వంట గింజల సాగు దేశవ్యాప్తంగా 68,24 లక్షల హెక్టార్లలో జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 2.47 లక్షల హెక్టార్లు తక్కువ.
  • గత ఖరీఫ్​ సీజన్​లో.. సోయాబిన్ ఉత్పత్తి ప్రధాన నూనె గింజల పంటగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 18 శాతం తక్కువగా ఉన్నట్లు అంచనా.
  • సోయాబిన్ ప్రాసెసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సోపా) అంచనాల ప్రకారం.. దేశంలో ఈ ఏడాది సోయాబిన్​ ఉత్పత్తి 89.94 లక్షల టన్నులు. గత ఏడాది ఉత్పత్తయిన 109.33 లక్షల టన్నులతో పోలిస్తే 71.73 శాతం తక్కువ.

ఇదీ చూడండి:మోటో​కు శాంసంగ్​ పోటీ- త్వరలో వర్టికల్​ ఫోల్డ్​ ఫోన్​ రిలీజ్!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Westpac Stadium, Wellington, New Zealand - 21st December 2019
Wellington Phoenix(YELLOW) vs Sydney FC(BLUE),
1. 00:00 Team walkout
2. 00:07 Minute of silence for the victims of the White Island volcano eruption
First half:
3. 00:13 SYDNEY GOAL - Adam Le Fondre scores in the 14th minute, 1-0 Sydney FC
4. 00:36 Replay
5. 00:41 WELLINGTON GOAL - Reno Piscopo scores from David Ball's cross in the 25th minute, 1-1
6. 01:07 Replay
7. 01:17 WELLINGTON GOAL - Ulises Davilla scores from Reno Piscopo's cross in the 37th minute, 2-1 Wellington
8. 01:36 Replay
Second half:
9. 01:40 SYDNEY GOAL - Defender Steven Taylor scores an own goal in the 56th minute, 2-2
10. 01:56 Replay
SOURCE: IMG
DURATION: 02:02
STORYLINE:
Sydney FC's six-match winning streak in the A-League ended on Saturday as they drew 2-2 away against Wellington Phoenix.
The league leaders snatched a draw from a near defeat after Steven Taylor's own goal in the 56th minute.
The draw meant Sydney are on 25 points after ten matches, six ahead of second place Melbourne City.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.