ETV Bharat / business

మోటో​కు శాంసంగ్​ పోటీ- త్వరలో వర్టికల్​ ఫోల్డ్​ ఫోన్​ రిలీజ్! - శాంసంగ్​ నుంచి మరో కొత్త ఫోన్​

మార్కెట్లోకి మరో ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​ను తెచ్చేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. అయితే ఈ సారి నిలువుగా మడతబెట్టే సదుపాయంతో కొత్త ఫోన్​ను తీసుకురానుంది శాంసంగ్. మరి ఆ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు రానుంది? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? అనే విశేషాలు మీ కోసం.

SAMSUNG
శాంసంగ్ మడత ఫోన్
author img

By

Published : Dec 21, 2019, 7:01 AM IST

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్​ మరోసారి మడత ఫోన్​​తో మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అడ్డంగా మడపెట్టే స్మార్ట్​ ఫోన్​ 'గెలాక్సీ ఫోల్డ్​'ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన శాంసంగ్​ ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో మోడల్​ను తీసుకురానుంది. అయితే ఈ సారి నిలువుగా మడతపెట్టే స్మార్ట్​ఫోన్​తో వచ్చేందుకు శాంసంగ్​ సన్నాహాలు చేస్తోంది. వర్టికల్​గా మడతబెట్టే ఫోన్లు అభివృద్ధి చేస్తున్నట్లు శాంసంగ్ ఇదివరకే అధికారికంగా ప్రకటించింది.

తాజాగా వర్టికల్ ఫోల్డబుల్​ ఫోన్​ విడుదలపై పలు రకరకాల ఊహాగానాలు ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఈ కొత్త ఫోన్​ను అవిష్కరించాలని శాంసంగ్​ నిర్ణయించినట్లు సమాచారం.

మార్కెట్లో ఇప్పటికే వర్టికల్ ఫోల్డబుల్​ ఫోన్​..

లెనోవో గ్రూపులో భాగమైన మోటో సంస్థ ఇప్పటికే 'రేజర్​' పేరుతో నిలువుగా మడబెట్టే స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. శాంసంగ్​ కన్నా ముందుగానే వచ్చే ఏడాది జనవరిలోనే ఈ స్మార్ట్​ఫోన్​​ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు టెక్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. మడతఫోన్ల సెగ్మెంట్​లో ​శాంసంగ్​ వర్టికల్ ఫోన్​కు.. మోటో రేజర్​కు మధ్య గట్టి పోటీ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.

శాంసంగ్​ వర్టికల్​ ఫోల్డ్ అంచనాలు..

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ కొత్త మోడల్​ను 'శాంసంగ్​ డబ్ల్యూ20 5జీ'గా మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి.
మరికొన్ని టెక్​ వార్తా సంస్థలు.. గెలాక్సీ ఫోల్డ్​ 2 పేరుతో కొత్త మోడల్​ను ఆవిష్కరించే అవకాశముందని అంటున్నాయి.

ఇదీ చూడండి:ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి ఆనంద్​ మహీంద్రా గుడ్​ బై!

Hyderabad, Dec 20 (ANI): Speaking to ANI, on violent anti-CAA protests, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi said that people who perpetrate violence are the real enemy of the protests against the new citizenship law. "Protest is a constitutional right and is a part of Article 19. We condemn violence at any cost, those who perpetrate violence, they are the real enemy of the protest," said Owaisi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.