ETV Bharat / business

జీఎస్​టీ పరిహారంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ - జీఎస్టీ ఆదాయపు లోటు

జీఎస్​టీ పరిహారానికి సంబంధించి లోటును పూడ్చుకునేందుకు రుణాలు తీసుకునే అవకాశాలను సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం. జీఎస్​టీ మండలి భేటీలో సూచించిన ఐచ్ఛికాలను నివేదించింది.

BIZ-GST-STATES
జీఎస్​టీ
author img

By

Published : Aug 29, 2020, 10:38 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన జీఎస్టీ ఆదాయంలో ఏర్పడే.. రూ. 2.35 లక్షల కోట్ల లోటును పూడ్చుకునేందుకు రుణాలు తీసుకునే అవకాశాలను సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు జీఎస్టీ వార్షిక సమావేశంలో రాష్ట్రాలకు సూచించిన ఐచ్ఛికాలను లేఖలో పేర్కొంది.

తొలి ఐచ్ఛికం కింద రాష్ట్రాలకిచ్చే రూ.97 వేల కోట్ల పరిహారాన్ని ఆర్​బీఐ నుంచి ప్రత్యేక గవాక్షం ద్వారా కేంద్రమే సమకూర్చుతుంది. రెండో ఐచ్ఛికంలో భాగంగా ఆర్​బీఐ ద్వారా రూ.2.35 లక్షల కోట్ల రుణాల సేకరణకు కేంద్రం సహకరిస్తుంది.

ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వసూళ్లు తగ్గటం వల్ల పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలన్న కేంద్ర సూచనను భాజపాయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇదీ చూడండి: జీఎస్​టీ బకాయిలపై రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.