జీఎస్టీ మండలి సమావేశానికి ముందు కీలక విషయాలు వెల్లడించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ రేట్లు పెంచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. తన కార్యాలయంలో తప్పా.. అలాంటి వదంతులు అంతటా వినిపిస్తున్నాయన్నారు.
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నష్టపరిహారాన్ని పూడ్చేందుకు.. ప్రస్తుతమున్న 5,12,18,28 శాతాలుగా ఉన్న జీఎస్టీ రేట్లను పెంచుతున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలు చెప్పారు.
అయితే జీఎస్టీ రేట్లు పెంచే యోచన లేదని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ అంశం తమ శాఖలో చర్చకు రాలేదని మాత్రం స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే?