కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తూ సేవా రంగ కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. వరుసగా రెండో నెలలోనూ సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50కి పైగా నమోదైనట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక పేర్కొంది. ఆర్డర్లు పెరగటం వ్యాపారాల వృద్ధికి తోడైనట్లు వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. నవంబర్‌లో సేవా రంగ పీఎంఐ అక్టోబర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గి. 54.1 నుంచి 53.7గా నమోదైంది. అయినప్పటికీ లాక్డౌన్ సడలింపులు, డిమాండ్ వృద్ధి వంటివి సేవా రంగానికి సానుకూలమైన అంశాలుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది ఐహెచ్ఎస్ మార్కిట్.
పీఎంఐ వృద్ధి ఇలా..
లాక్డౌన్ కారణంగా జూన్‌లో 33.7, జులైలో 34.2కి పడిపోయిన సేవా రంగ పీఎంఐ.. అన్‌లాక్ ప్రక్రియతో ఆగస్టులో 41.8కి, సెప్టెంబర్‌లో 49.8కి పెరిగింది.
ఉపాధి పెరిగింది..
సేవా రంగంలో వరుసగా 8 నెలలు స్తబ్దుగా ఉన్న ఉపాధి వృద్ధి రేటు నవంబర్‌లో స్వల్పంగా పెరిగినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక పేర్కొంది.
ఇదీ చూడండి:మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు