ETV Bharat / business

'ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల అమలు సవాలే' - 2021 బడ్జెట్​

15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను అమలు చేయటం అతిపెద్ద సవాలని బెంగళూరుకు చెందిన బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ డాక్టర్​ ఎన్ఆర్ భానుమూర్తి అన్నారు. 2021-22 బడ్జెట్ దేశంలో వైద్యారోగ్య మౌలిక సదుపాయలను కల్పించటంపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.

budget-2021-integrating-finance-commission-recommendations-to-be-a-challenge
ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను పొందుపరచటమే సవాలు
author img

By

Published : Nov 28, 2020, 4:14 PM IST

దేశ బడ్జెట్ 2021-22కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. గత బడ్జెట్​తో పోల్చితే పెద్ద సవాళ్లపై ప్రభుత్వంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను బడ్జెట్​లో పొందుపరచటం అతిపెద్ద సవాలని బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ డా.ఎన్ఆర్ భానుమూర్తి అన్నారు.

ఈ నెల మొదట్లో 15వ ఫైనాన్స్ కమిషన్ 2021-22 నుంచి 2025-26 సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఇందులో రాష్ట్రాలకు పన్ను వాటా, స్థానిక స్వపరిపాలన సంస్థలకు గ్రాంట్లు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు తదితరాల అంశాలపై సిఫారసులు చేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈ నివేదిక ప్రజలకు అందుబాటులోకి రానుంది.

“ఫైనాన్స్ కమిషన్ సిఫారసులే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది విషయం ఇంకా తెలియదు. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు కావాల్సిన రోడ్ మ్యాప్​పై కొంచెం దృష్టి సారించే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. రాష్ట్రాలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు పన్నుల్లో వాటా గురించి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు చేస్తుంది కాబట్టి.. రాష్ట్రాల బడ్జెట్​లు కమిషన్ సిఫార్సులు, వాటి అమలుపై ఆధారపడి ఉంటాయి”- భానుమూర్తి, బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్.

5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన అనంతరం మార్చి 25 నుంచి మూడు నెలల పాటు దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఏప్రిల్-జూన్ మధ్య జీడీపీ 23.9 శాతం తగ్గిపోయింది.

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు రూ.29.87 లక్షల కోట్ల మేర ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. జీడీపీలో ఈ ఉద్దీపన ప్యాకేజీని పోల్చినట్లైతే కేవలం సింగిల్ డిజిట్ నంబర్ కు పరిమితమైందని, దీనితో మరిన్ని చర్యలకు వెసులుబాటు ఉన్నట్లు భానుమూర్తి అభిప్రాయపడ్డారు.

“నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చే ఐదు సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని 2025-26కు పొడిగించే అవకాశం ఉంది. కోవిడ్ రికవరీలో ఉండే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక పరిస్థితులు ఉండనున్న దృష్ట్యా… గత బడ్జెట్ తో పోల్చితే రాబోయే బడ్జెట్ లో సవాళ్లు పెద్దవిగా ఉండనున్నాయి” - భానుమూర్తి.

వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పన

కోవిడ్ అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్యారోగ్య రంగంలో కీలక విధాన సంస్కరణల ఆవశ్యకత ఉందని భానుమూర్తి అన్నారు. వాటిలో కొన్నింటిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని, వీలైతే వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అమలు చేయాలని ఆయన తెలిపారు.

కోవిడ్ అనంతర రికవరీలో ఉంది కాబట్టి.. గతంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా 2022వరకు అందరికి ఇళ్లు లాంటి లక్ష్యాలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.

ఉద్యోగ కల్పనలో సవాళ్లు

ఉద్యోగ కల్పన అనేది తయారీ రంగంపై ఆధారపడి ఉంటుందని భానుమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలో తన వాటాను ప్రస్తుతం ఉన్న 15-16 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

“నూతన కార్మిక చట్టాలు, వ్యవసాయ సంస్కరణలు తదితరాలతో ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంది. వీటితో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సంస్కరణలు పలు రంగాల్లో విదేశీ మూలధనానికి అవకాశం కల్పించనున్నాయి. ఈ చర్యలన్నీ తయారీ రంగానికి పెద్ద ఎత్తున ఉపయోగపడి, ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచాలి” - భానుమూర్తి.

ఇదీ చూడండి:- ఆర్థిక వృద్ధిలో పుంజుకున్న భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.