ETV Bharat / business

రూ.1.61 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల నిర్ణయం

రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాది రూ.1.61లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిన బ్యాంకర్లు దాదాపు 76శాతం రూ.1.22లక్షల కోట్లు ప్రాధాన్యత రంగానికి కేటాయించారు. ఎంఎస్‌ఎంఇలకు రూ.35వేల కోట్లు, స్వల్పకాలిక రుణాలు కింద రూ.53వేలు కోట్లు లెక్కన రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం వెల్లడించింది. గృహ, విద్య రంగాలకు పదివేల కోట్లకుపైగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.

author img

By

Published : Jul 6, 2020, 8:14 PM IST

SLBC
SLBC

రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ ఆర్థిక ఏడాది భారీ ఎత్తున రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇవాళ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లు వెల్లడించారు. ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన 26వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ ఓం ప్రకాష్‌ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2019-20 ఆర్థిక ఏడాదికి చెంది రాష్ట్రంలోని బ్యాంకుల పనితీరు వివరాలను సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మిశ్ర వెల్లడించారు.

బ్యాంకు డిపాజిట్లు రూ.4.58 లక్షల కోట్లు

2019 మార్చి నాటికి రూ.4.54లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల డిపాజిట్లు ఈ ఏడాది మార్చి చివరినాటికి రూ.30,168 కోట్లు పెరిగి రూ.4.84లక్షల కోట్లకు చేరినట్లు మిశ్ర వెల్లడించారు. గతేడాది మార్చి చివర నాటికి రూ.5.33లక్షల కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి చివర నాటికి రూ.5.70లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ.37,109 కోట్లు, వ్యవసాయ టెర్మ్‌ రుణాల కింద వ్యవసాయ అనుబంధ పరికరాలు కొనుగోలు కోసం రూ.14,850 కోట్లు, విద్య రుణాలు రూ.977 కోట్లు, గృహ రుణాలు రూ.5,099 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.1.11లక్షల కోట్లు రుణాలు ఇచ్చి 99.77శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.49,848 కోట్లు రుణాలు ఇచ్చి నిర్దేశించిన లక్ష్యంలో 158శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.

'ముద్ర' కింద రూ.6,960కోట్లు

1.74లక్షల మంది మైనార్టీలకు రూ.2,668కోట్లు, 26.73లక్షల మంది బలహీన వర్గాల లబ్ధిదారులకు రూ.21,860 కోట్లు, ఎస్టీ, ఎస్టీ కెటగిరీ లబ్ధిదారులకు రూ.5,071 కోట్లు రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన-పీఎంఎంవై కింద రూ.6,960 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా... రూ.9,128 కోట్లు రుణాలు ఇచ్చి 131శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ.1.46లక్షల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఆర్థిక ఏడాదిలో 10.52శాతం అధికంగా రూ.1.61లక్షల కోట్లు మొత్తం రుణాలు కింద ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మిశ్ర వెల్లడించారు. ప్రాధాన్యత రంగానికి గత ఆర్థిక ఏడాదిలో రూ.1.11లక్షల కోట్లు రుణ లక్ష్యంకాగా ఈ ఆర్థిక ఏడాదిలో 10.27శాతం పెంచి రూ.1.22లక్షల కోట్లు మొత్తాన్ని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

వ్యవసాయ రుణ లక్ష్యం పెంచాం

గతేడాది వ్యవసాయ రంగ రుణ లక్ష్యం రూ.68,596 కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 9.54శాతం అధికంగా అంటే రూ.74,141.71 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఆర్థిక ఏడాది స్వల్ప కాలిక రుణ లక్ష్యంగా రూ.48,740 కోట్లు ఉండగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.53,222 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు టెర్మ్‌ రుణాల కింద 12వేల కోట్లు, మౌలిక వసతులకు రూ.2,422 కోట్లు, వ్యవసాయం సహాయక చర్యల కోసం రూ.7436 కోట్లు, సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.35,196 కోట్లు, గృహాలకు రూ.8,048 కోట్లు, విద్య రుణాల కింద రూ.2166 కోట్లు, ఇతర రంగాలకు రూ.2167.55 కోట్లు లెక్కన లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

9గ్రామాలకు తప్ప..

రాష్ట్రంలో అయిదువేలు కంటే ఎక్కువ జనాభా ఉండి బ్యాంకులు లేని 255 ప్రాంతాల్లో గ్రామీణ అవుట్‌లెట్లతో కవర్‌ చేసినట్లు వెల్లడించారు. ఏలాంటి మార్గం లేని తొమ్మిది గ్రామాలు మినహా అయిదు కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉన్న అన్ని పల్లెలకు బ్యాంకింగ్‌ సదుపాయం కల్పించినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ ఖాతాలు 96.52 లక్షలు ఉండగా అందులో 81.92లక్షల ఖాతాదారులకు రూపే కార్డులు అందచేశామని అధికారులు తెలిపారు. 75.37లక్షల మంది ఖాతాదారులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన-పీఎంఎస్‌బివై కింద 25.11లక్షల మంది ఈ పథకం కింద కవర్‌ అయ్యారు. అటల్‌ పెన్షన్‌ యోజన కింద మరో 2.23లక్షల మంది లబ్ధి పొందినట్లు వివరించారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.