ETV Bharat / business

'వ్యాక్సిన్ వ్యయాలపై 200% పన్ను డిడక్షన్​!' - 2021-22 బడ్జెట్​పై కేంద్రానికి అసోచామ్ సూచనలు

కరోనా వ్యాక్సిన్​కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనలు, అభివృద్ధి వ్యయాలకు 200 శాతం పన్ను డిడక్షన్​ ఇవ్వాలని ఆర్థిక శాఖకు సూచించింది పరిశ్రమల విభాగం అసోచామ్. వచ్చే బడ్జెట్​లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.

Assocham on tax deduction for COVID vaccine development
కొవిడ్ వ్యాక్సిన్ పరిశోధనలకు పన్ను డిడక్షన్​పై అసోచామ్ సూచనలు
author img

By

Published : Dec 7, 2020, 12:09 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సర(2021-22) బడ్జెట్​లో కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి వ్యయాలకు.. పన్ను గణనలో 200 శాతం డిడక్షన్ ఇవ్వాలని పరిశ్రమల విభాగం అసోచామ్ ఆర్థిక శాఖను కోరింది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 35 ద్వారా పొందే ప్రయోజనాలకోసం 'శాస్త్రీయ పరిశోధన'ల్లో కొవిడ్​-19కి చెందిన అన్ని రకాల రీసెర్చ్​లను చేర్చాలని సూచించింది అసోచామ్. ప్రస్తుతం సెక్షన్​ 35 ద్వారా శాస్త్రీయ పరిశోధనల వ్యయాలకు 100 శాతం డిడక్షన్​ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రీ బడ్జెట్ మెమొరాండమ్​లో ఈ ఆంశాలను పేర్కొంది.

'2021-22 బడ్జెట్​లో నిర్మలా సీతారామన్ హెల్త్​కేర్ రంగానికి​ ఊతమందించే భారీ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికే మేము పంపిన మెమొరాండంలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, వైద్య రంగానికి ఇవ్వాల్సిన పన్ను ప్రోత్సాహకాలపై సూచనలు చేశాం.' అని అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్​ అన్నారు.

ఇదీ చూడండి:'ఈనెల 12న చిన్న వ్యాపారుల దినోత్సవం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.