ETV Bharat / business

వృద్ధి రేటు: భారత్​కు కోత- చైనాకు యథాతథం! - చైనా వృద్ధి రేటుపై ఏడీబీ అంచనాలు

భారత వృద్ధి రేటు 2021-22లో 10 శాతానికి పరిమితం కావచ్చని ఏషియన్​ డెవలప్​మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఇంతకు ముందు 11 శాతంగా ఉన్న అంచనాను కరోనా 2.0 ప్రభావం వల్ల దిగువకు సవరించినట్లు తెలిపింది. పొరుగు దేశం చైనా వృద్ధి రేటు అంచనాలను మాత్రం యథాతథంగా ఉంచింది ఏడీబీ.

ADB cut India growth Forecast
భారత వృద్ధి రేటు అంచనాలకు కోత
author img

By

Published : Jul 20, 2021, 1:23 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను ఏషియన్ డెవలప్​మెంట్​ బ్యాంక్ (ఏడీబీ) దిగువకు సవరించింది. 2021-22లో భారత వృద్ధి రేటు 10 శాతానికి పరిమితమవ్వచ్చని ఏషియన్ డెవలప్​మెంట్ ఔట్​లుక్​ (ఏడీఓ) పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్​లో విడుదల చేసిన ఏడీఓ నివేదికలో ఈ అంచనా 11 శాతంగా ఉంది. కరోనా రెండో దశ వల్ల ఏర్పడిన సంక్షోభమే అంచనాలను దిగువకు సవరించేందుకు కారణంగా నివేదిక వెల్లడించింది.

చైనా విషయానికొస్తే.. 2021లో 8.1 శాతం, 2022లో 5.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందన్న అంచనాలను యథాతథంగా ఉంచింది ఏడీఓ. ఏప్రిల్​ అంచనాలకు అనుగునంగానే ఆ దేశంలో పరిస్థితులు ఉన్నట్లు వివరించింది.

దక్షిణాసియా వృద్ధి రేటు కూడా 2021లో 8.9 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది ఏడీఓ. ఇంతకు ముందు ఈ అంచనా 9.5 శాతంగా ఉంది. 2022లో మాత్రం వృద్ధి రేటు 7 శాతానికి (ఏప్రిల్​ అంచనా 6.6 శాతం) పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రాంత వృద్ధి రేటుపై సానుకూల అంచనాలను విడుదల చేసింది ఏడీఓ. 2021లో 7.3 శాతం, 2022లో 5.4 శాతం వృద్ధి రేటు ఈ ప్రాంతంలో నమోదవ్వచ్చని తెలిపింది. ఇందకు ముందు నివేదికలో ఈ అంచనాలు వరుసగా.. 7.2 శాతం, 5.3 శాతంగా ఉన్నాయి.

ఇదీ చదవండి:కరోనా చీకట్లో కాంతిపుంజం.. కోలుకుంటున్న దేశార్థికం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.