ETV Bharat / business

'సహజ్​ ఫారం'లో ఈ మార్పులు తెలుసా? - కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు

2019-20కి సంబంధించి ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు నూతన ఐటీఆర్ ఫారంలు విడుదల చేసింది ఆదాయపన్ను శాఖ. ఐటీఐర్​1 నుంచి ఐటీఆర్​7 వరకు వీటిలో ఉన్నాయి. సహజ్​ ఫారం అని పిలిచే ఐటీఆర్​1 ఫారంలో స్వల్ప మార్పులు చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

'సహజ్​ ఫారం'లో ఈ మార్పులు
author img

By

Published : Apr 9, 2019, 10:46 AM IST

ఆదాయ పన్ను రిటర్నులకు సంబంధించి నూతన ఐటీఆర్​ ఫారాలను విడుదల చేసింది ఆదాయ పన్ను శాఖ. 2018-19తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ వీటినే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

ఐటీఆర్ 1( సహజ్​)లో స్వల్ప మార్పులు చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). ఇతర ముఖ్యమైన వివరాలు చూద్దాం.

ఐటీఆర్ 1 ఎవరు వాడాలి?

ఇది భారత్​లో నివసిస్తున్న వారికే. వేతనాలు, ఇంటి అద్దె, ఇతర ఆదాయ మార్గాల(వడ్డీలు) నుంచి రూ.50 లక్షల లోపు ఆదాయం వచ్చే వారు దీనిని దాఖలు చేయాల్సి ఉంటుంది.

స్టాండర్డ్​ డిడక్షన్(ప్రామాణిక కోత)

ఈ ఏడాది ఐటీఆర్​1లో స్టాండర్డ్ డిడక్షన్​ చేసేందుకు ప్రత్యేక కాలమ్​ను పొందుపరిచింది ఆదాయపన్ను శాఖ. స్టాండర్డ్ డిడక్షన్ అంటే వేతనంలోంచి వైద్యం, రవాణా ఖర్చుల నిమిత్తం తీసేసే మొత్తం. దీనిపై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరంలేదు.

గతంలో ఇది 34,200గా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి స్టాండర్డ్​ డిడక్షన్​(ప్రామాణిక కోత)కు రూ.40,000 పరిమితి విధించింది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.50,000కు పెంచింది.

ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం వివరాలు

ఇప్పటి వరకూ ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం ఎంత అని రిటర్నులో పేర్కొంటే సరిపోయేది. తాజా మార్పుల్లో ఆ ఆదాయం ఎలా వస్తుందనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇతర మార్గాల నుంచి ఆదాయం అంటే... వడ్డీలు, పోస్టాఫీస్​ పొదుపు పథకం, బ్యాంకు ఫిక్సిడ్​ డిపాజిట్లు ఇలా ఏ ఆదాయ మార్గమైనా వాటి వివరాలు తెలపాల్సి ఉంటుంది.

ఐటీఆర్​1 ఎవరు వాడకూడదు?

భారతీయులై ఉండి... ఏదైనా కంపెనీలో డైరెక్టర్​ స్థాయిలో ఉన్నా... అన్​లిస్టెడ్​ కంపెనీల్లో వాటాలు ఉన్నా వారు ఐటీఆర్​ 1ను వాడకూడదు.

రెండు ఇళ్లు ఉన్నాయా?

మీకు రెండో ఇల్లు ఉంటే అది ఎక్కడ ఉంది వాటి పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అందులో మీరే ఉంటున్నారా... వేరే ఎవరైనా ఉంటున్నారా అనే వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో మీరు ఎక్కడ ఉన్నారు

ఈ ఏడాది మీరు ఐటీఆర్​ 2ను సమర్పించినట్లయితే... తప్పనిసరిగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మీరు ఎక్కడున్నారనే విషయాన్ని చెప్పాలి. విదేశాల్లో ఉంటున్న భారతీయులైతే గతేడాది ఎన్నిరోజులు భారత్​లో ఉన్నారనే వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు ఇక్కడ చూడండి

ఇవీ చూడండి: 'పన్ను బాదకుంటే అలాంటి పథకాలు వీలుకావు'

వాయిదా పద్ధతిలో బీమా క్లెయిమ్​ల చెల్లింపుపై కసరత్తు

RESTRICTION SUMMARY: KGTV, MUST CREDIT, NO ACCESS SAN DIEGO, NO USE US TV NETWORKS
STORYLINE:
KGTV – MUST CREDIT, NO ACCESS SAN DIEGO, NO USE US BROADCAST NETWORKS
San Diego – 6 April 2019
1. Various, giant pandas at the San Diego Zoo
2. Zoo visitors walk toward Panda exhibit
3. Zoo officials hang bells to mark the departure of the zoo's two giant pandas.
4. Various, giant pandas at the San Diego Zoo
STORYLINE:
The two giant pandas at the San Diego Zoo, Bai Yun and Xiao Liwu, will be returning to China at the end of the month.
The last day to see the pandas will be April 27
The zoo is selling special commemorative bells to mark the creatures' departure.
The San Diego Zoo has had a more than two-decade partnership with China to research giant pandas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.