రెడ్మీ నోట్ సీరిస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం షియోమీ. ' రెడ్ మీ నోట్ 8', 'రెడ్ మీ నోట్ 8 ప్రో' పేర్లతో వీటిని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లను వెనుకవైపు నాలుగు కెమెరాలతో అందుబాటులోకి తెచ్చింది షియోమీ. నాలుగు కెమెరాలతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే.. రెడ్మీ నోట్ 8 సిరీస్ ఫోన్ల ధర చాలా వరకు తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ రెండు ఫోన్లు ఈ నెల 21 నుంచి రెడ్మీ డాట్కామ్, అమెజాన్ ఇండియాలో కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి.
రెడ్మీ నోట్ 8 పూర్తి వివరాలు...
- 4 జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.9,999
- 6 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.12,999
- 6.30 అంగుళాల పూర్తి హెచ్డీ.. డాట్ నాచ్ డిస్ప్లే
- గొరిల్లా గ్లాస్ 5 రక్షణ
- రియర్ ఫింగర్ప్రిట్ సెన్సర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
- అండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ వ్యవస్థ
- 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
రెడ్మీ నోట్ 8 ప్రో వివరాలు...
- 6 జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.14,999
- 6 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.15,999
- 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.17,999
- 6.58 అంగుళాల పూర్తి హెచ్డీ, డాట్ నాచ్ డిస్ప్లే..
- గొరిల్లా గ్లాస్ 5 రక్షణ
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (64 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
- మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
- లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ
- అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ (బిల్ట్ ఇన్)
- అండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ వ్యవస్థ
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇదీ చూడండి: పేదరికం నిర్మూలనలో భారత్ భేష్: ప్రపంచ బ్యాంకు