ETV Bharat / business

విప్రోకు షాక్- సీఈఓ అబిదాలీ రాజీనామా

విప్రో సీఈఓ పదవికి రాజీనామా చేశారు అబిదాలీ నీముచ్​వాలా. కుటుంబపరమైన సమస్యలతోనే సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విప్రోకు కొత్త సీఈఓను నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

wipro
విప్రో
author img

By

Published : Jan 31, 2020, 11:41 AM IST

Updated : Feb 28, 2020, 3:36 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవి నుంచి తప్పుకున్నారు అబిదాలీ నీముచ్‌వాలా. నేడు తెల్లవారు జామున రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కుటుంబపరమైన కారణాలతో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఆ పదవిలో కొనసాగునున్నారు అబిదాలీ. విప్రో ఇప్పటికే కొత్త సారథిని వెతికే పనిలో పడింది.

అందరికీ కృతజ్ఞతలు..

"75 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్ర కలిగిన విప్రోకు సేవ చేయటం నాకు లభించిన గౌరవం. మా ప్రయాణంలో మేము గుర్తించదగిన పురోగతిని సాధించాము. మా డెలివరీ విభాగాన్ని అభివృద్ధి చేశాము. కస్టమర్ల వ్యవస్థను వ్యవస్థీకరించాము" అని అబిదాలీ నీముచ్​వాలా ప్రకటనలో పేర్కొన్నారు.

ఇన్ని సంవత్సరాలుగా తనకు సహాయ సహకారాలందించినందుకు ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆయన కుమారుడు రిషాద్‌ ప్రేమ్‌జీ, డైరక్టర్లు, సహోద్యోగులు, వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అబిదాలీని కొనియాడిన అజిమ్​ ప్రేమ్​జీ..

సంస్థకు అందించిన సేవలను విప్రో ఛైర్మన్​ అజీమ్​ ప్రేమ్​జీ కొనియాడారు.

"విప్రోకు నాయకత్వం వహించినందుకు, అందించిన సేవలకు అబిద్‌కు మా కృతజ్ఞతలు. మేము మానసికంగా బలపడేందుకు, ముఖ్యమైన విజయాలు సాధించేందుకు, మా డిజిటల్‌ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అబిదాలీ కృషి చేశారు" -అజీమ్‌ ప్రేమ్‌జీ, విప్రో ఛైర్మన్​

భవిష్యత్తులో ఆయనకు అంతా మంచి జరగలని ప్రేమ్​ జీ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:టెక్​ దిగ్గజం ఐబీఎం నూతన సీఈఓగా భారతీయుడు

Last Updated : Feb 28, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.